Sargam Kaushal Mrs World-2022 : మిసెస్ వరల్డ్ గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్ కు..

భారత్ కు మిసెస్ వరల్డ్-2022 కిరీటం దక్కింది. 21 ఏళ్ల తర్వాత ఇండియాను వరించింది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పాల్గొనగా సర్గం కౌశల్ కు లభించింది.

Sargam Kaushal Mrs World-2022 : మిసెస్ వరల్డ్ గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్ కు..

Sargam Kaushal

Updated On : December 19, 2022 / 1:38 PM IST

Sargam Kaushal Mrs World-2022 : భారత్ కు మిసెస్ వరల్డ్-2022 కిరీటం దక్కింది. 21 ఏళ్ల తర్వాత ఇండియాను వరించింది. ముంబైకి చెందిన సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పాల్గొనగా సర్గం కౌశల్ కు లభించింది. మిసెస్ వరల్డ్-2021 విజేత అయిన అమెరికాకు చెందిన షైలిన్ ఫోర్డ్.. సర్గమ్ కౌశల్ కు కిరీటాన్ని బహూకరించారు.

63 దేశాలకు చెందిన మహిళలను ఓడించి కౌశల్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ పోటీల్లో పాలినేషియా, కెనడాకు చెందిన వనితలు రన్నరప్పస్ గా నిలిచారు. 21 ఏళ్ల తర్వాత భారత్ నుంచి సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ గా ఎంపికైనట్లు మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

Mrs World Arrested : మిసెస్ శ్రీలంక పోటీల్లో గందరగోళం సృష్టించిన మిసెస్‌ వరల్డ్‌ అరెస్ట్

టైటిల్ ను గెలుచుకోవడంపై సర్గమ్ కౌశల్ హర్షం వ్యక్తం చేశారు. 21-22 ఏళ్ల తర్వాత భారత్ తరపున మళ్లీ కిరీటాన్ని అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
లవ్ యూ ఇండియా..లవ్ యూ వరల్డ్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

అయితే సర్గమ్ కౌశల్ జమ్మూకశ్మీర్ కు చెందిన మహిళా. ఆమె ఇంగ్లీష్ సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. కౌశల్ గతంలో వైజాగ్ లో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. తన భర్త ఇండియన్ నేవీలో పని చేస్తున్నట్లు తెలిపారు.