Pm Modi Cabinet లోకి రామ్ మాధవ్, మురళీధర్ రావు ?

  • Published By: madhu ,Published On : October 1, 2020 / 09:34 AM IST
Pm Modi Cabinet లోకి రామ్ మాధవ్, మురళీధర్ రావు ?

Updated On : October 1, 2020 / 9:45 AM IST

Pm Modi Cabinet : బీజేపీ జాతీయ నూతన కార్యవర్గంలో (BJP national team) తెలుగు రాష్ట్రాల సీనియర్ నేతల రామ్ మాధవ్ (Rammadhav), మురళీధర్ రావు (Muralidhar rao) లను పక్కన పెట్టేయడంపై ఆ పార్టీలో హాట్ హాట్ చర్చలు సాగుతున్నాయి. కార్యవర్గంలోకి ఎందుకు తీసుకోలేదు ? పార్టీకి విధేయులుగా ఉన్న వీరిని ఎందుకు దూరం పెట్టారనే దానిపై చర్చించుకుంటున్నారు. కానీ..మరో ప్రచారం జరుగుతోంది.



మురళీధర్ రావు, రామ్ మాధవ్ లకు ప్రధాన మంత్రి కేబినెట్ (Modi Cabient) లోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. అందుకే వారిని కార్యవర్గంలోకి తీసుకోలేదని తెలుస్తోంది. పార్టీకి చాలాకాలంగా సేవలందిస్తున్న వీరికి సముచితస్థానం కల్పించాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోందని సమాచారం.



ఎందుకంటే..అంతర్జాతీయ వ్యవహారాలపై రామ్ మాధవ్ కు పట్టు ఉండగా, వ్యాపార వ్యవహారాల్లో మురళీధర్ రావుకు విశేష అనుభవం ఉంది. రామ్ కు విదేశాంగ శాఖ, మురళీధర్ కు వాణిజ్య శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది.
ఇటీవలే ప్రకటించిన జాతీయ కార్యవర్గ కమిటీ (BJP national team)లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు స్థానం దక్కింది.



డీకే అరుణ, దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు చోటు కల్పించింది. డీకే అరుణకు జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి దక్కగా.. ఏపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌కు కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు లభించాయి. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్ష పదవి లభించింది. ప్రచారం జరుగుతున్నట్లు వీరిద్దరినీ మోడీ కేబినెట్ లోకి తీసుకుంటారా ? లేదా ? అనేది చూడాలి.