ఢిల్లీ అల్లర్లు..ఇద్దరు పిల్లల ప్రాణాల కాపాడటం కోసం బిల్డింగ్ పైనుంచి దూకేసిన మహిళ

ఢిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన అల్లర్లు అత్యంత హింసాత్మకంగా మారాయి. ఈ హంసల మధ్య ప్రాణాలు దక్కించుకోవటానికి ఢిల్లీ వాసులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. సీఏఏ వ్యతిరేకంగా కొందరు..అనుకూలంగా కొందరు చేస్తున్న ఈ ఆందోళనకు మహిళలు..చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో 45 సంవత్సరాల మహిళ తన బిడ్డల్ని కాపాడుకోవటానికి ప్రాణాలకు తెగించి..భవనం మొదటి అంతస్తు నుంచి దూకేసింది. ఇటువంటి ఘటనలో ఢిల్లీలో ఎన్నో..ఎన్నెన్నో. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు.
మనుషులమనే మాట మరచిపోయిన ఆందోళనకారులు నరరూప రాక్షసులుగా మారారు.ఇళ్లలోకి చొరబడి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కరవాల్ నగర్ లోని ఓ భవనంలో మొదటి అంతస్తులో ఎన్జీవో నడుపుతున్న 45ఏళ్ల చతుర్భజ అనే మహిళ ఇంట్లోకి ఆందోళనకారులు ఆయుధాలతో చొరబడ్డాడు.
ఆమె ఇద్దరు కుమార్తెలపై దాడికి దిగారు. దీంతో ఆమె అక్కడ నుంచి అతి కష్టమ్మీద వారి నుంచి తన కుమార్తెల ప్రాణాలు కాపాడుకోవటానికి బిల్డింగ్ మొదటి అంతస్తునుంచి దూకేసింది. అలా దూకేటప్పుడు బిడ్డలిద్దరికి గాయాలు కాకుండా ఉండటానికి వారికి తనకూ ఇంటిలో ఉండే దుప్పట్లను చుట్టేసింది. ఆ తరువాత ఆమె ఇద్దరు కుమార్తెలతో పైనుంచి దూకేసింది. దీంతో ఆమెకు ఇద్దరు కుమార్తెలకు గాయాలయ్యాయి.
కానీ గాయాలను పట్టించుకునే స్థితిలో లేరు. ప్రాణాలు దక్కించుకోవాలి. దాంతో పరిగెత్తారు. పరిగెత్తారు. అలా వారినుంచి తప్పించుకున్న చతుర్భుజ అయూబ్ అహ్మద్ అనే ఓ కిరాణాషాపు యజమాని ఇంట్లో తలదాచుకుంది. వారికి కావాల్సిన వస్తువుల్ని అయూబ్ ఇచ్చి ఆదుకున్నాడు. తరువాత వారిని అతి కష్టంమ్మీద అల్ హింద్ హాస్పిటల్ కు వారిని తరలించటంతో ప్రస్తుతం అక్కడ వారు చికిత్సపొందుతున్నారు.
Also Read | ఢిల్లీ అల్లర్లు: పెళ్లయ్యాక ఒకసారే కలిసి భోజనం చేశారు.. పనిమీద వెళ్లి బుల్లెట్లకు బలైయ్యాడు భర్త
కాగా..ఆమెను ఆమె కుమార్తెలు అయూబ్ ఇంట్లోఆమె తలదాచుకుందని తెలుసుకుని ఆ ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారు. వాళ్లు అక్కడ లేకపోవటంతో ఆగ్రహం వ్యక్రం చేసిన ఆందోళనకారులు ఢిల్లీలో దొరక్కపోతుందా దాని పడి పడతాం అంటూ అయూబ్ ఇంట్లో చేతికందిన వస్తువుల్ని విసిరిపారేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై బాధితురాలు మాట్లాడుతూ..కరవాల్ లో తన ఇంటికి దగ్గర్లో ఉండే సల్మాన్ ఖాన్ అనే 20 ఏళ్ల యువకుడిని మంగళవారం (ఫిబ్రవరి 25,2020)రాత్రి అతనిపై యాసిడ్ పోసారు. అతని వీపు అంతా కాలిపోయింది.
అలా కొంతమంది వ్యక్తులు మాఇంటివైపు వచ్చారని ఈ క్రమంలో వారినుంచి తప్పించుకోవటానికి మా ఇంటి మొదటి అంతస్తు నుంచి నా ఇద్దరు కుమార్తెలతో దూకేసి ముస్లింలు నివసించే ప్రాంతానికి వచ్చేవరకూ మాకు భద్రత దక్కలేదని ఆమె కన్నీళ్లతో ఆవేదన వ్యక్తంచేస్తు తెలిపింది. ఢిల్లీలో ఇటువంటి ఎన్నో ఘటనలు జరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో..ఎవరు వచ్చి తమపై దాడిచేస్తారోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల ప్రజలు.