Nagaland : ఓ మంత్రిగారు వడా పావ్ తయారు చేసిన విధానం చూస్తే వండర్ అవుతారు.. ఎవరంటే?

ఆ మంత్రిగారు పాలనలోనే కాదు పాకశాస్త్రంలోనూ భేష్ అనిపించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతీయ వంటకాలను అదరహో అనిపించేలా వండేస్తున్నారు. ఎవరా మంత్రి?

Nagaland : ఓ మంత్రిగారు వడా పావ్ తయారు చేసిన విధానం చూస్తే వండర్ అవుతారు.. ఎవరంటే?

Nagaland

Updated On : October 11, 2023 / 5:33 PM IST

Nagaland : నాగాలాండ్ మినిస్టర్ టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన వడా పావ్ తయారు చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మంత్రిగారి పాకశాస్త్ర ప్రావీణ్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.

Temjen Imna Along : మహిళా సాధికారతపై నాగాలాండ్ మినిస్టర్ టెమ్‌జెన్ షేర్ చేసిన వీడియో వైరల్

టెమ్ జెన్ వంటలు చేస్తూ కనిపించిన వీడియో ఇది మొదటిసారి కాదు లెండి. గతంలో పానీ పూరి తయారు చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌లో ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మరో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వడా పావ్ తయారు చేయడమే కాదు.. అందరికీ రుచి చూపించారు. ఆలూ మెత్తగా ఉడికించడం.. వడలు వేయడం వరకూ ఆయన వడా పావ్ పూర్తిగా తయారు చేసే వరకూ వీడియోలో కనిపిస్తుంది. వండిన వడా పావ్‌లను తను టేస్ట్ చేయడమే కాదు అతని చుట్టూ ఉన్నవారికి రుచి చూపించడం కూడా వీడియోలో కనిపించింది.

Temjen Imna: అందమైన అమ్మాయిలతో నాగాలాండ్ మంత్రి గ్రూప్ ఫోటో.. ఆయన చూపులు మాత్రం..

‘నిరీక్షించినందుకు ధన్యవాదాలు.. ముంబయి నుంచి కోహిమా వరకు వడా పావ్ ప్రయాణం’ అనే శీర్షికతో టెమ్ జెన్ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ‘ మీరు మల్టీ టాలెండ్ సార్.. నెక్ట్స్ టైమ్ బెంగాలి డిష్ ప్రయత్నించండి..’ అని..’ టెమ్ జెన్ జీ.. మీరు ఇంకా ముంబయి, పూనే జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు’ అని మరొకరు ఇలా వరసగా కామెంట్లు పెట్టారు. అటు పాలనలో ఇటు పాకశాస్త్రంలో భేష్ అనిపించుకుంటున్నారు నాగాలాండ్ మంత్రి టెమ్ జెన్.