బాబుపై మోడీ ఫైర్ : బాబు పాలన ప్రజల కోసం కాదు
తెలుగు గౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక
ఎన్టీఆర్ విలువలకు తిలోదకాలు ఇచ్చారు
అధికారం కాపాడుకునేందుకే చంద్రబాబు ప్రయత్నం
మీరు తెలుగు వారి గౌరవాన్ని నిలబెడతారా..?
ప్రజలను నిర్లక్ష్యం చేస్తే తెలుగు వారి గౌరవం ఎలా నిలబడుతుంది..?
రాత్రీ, పగలు మోదీపై విమర్శలు చేస్తే తెలుగు వారి గౌరవం నిలబడుతుందా..?
ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బాబు – భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మధ్య మాటల విమర్శలు ఎక్కువవుతున్నాయి. గత కొన్ని రోజులుగా బాబు..మోడీపై విమర్శలు చేస్తుంటే…మౌనంగా ఉండద్దని మోడీ నిర్ణయించుకున్నారో ఏమో..ఆయన ఘాటైన కౌంటర్లు ఇస్తూ కాక పుట్టిస్తున్నారు. ఇటీవలే విశాఖలో బీజేపీ పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన మోడీ..బాబు..టీడీపీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ.
రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు పని చేయడం లేదని… కేవలం తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలోని ఐదు లోక్ సభ నియోజకవర్గాల బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీని వదిలేసి.. కేవలం కొడుకు రాజకీయ ఎదుగుదల పైనే చంద్రబాబు దృష్టి సారించారని మోదీ ఆరోపించారు. ఏపీలో భారీగా జరుగుతున్న అవినీతి, అక్రమాలు, పాలసీలను చంద్రబాబు పట్టించుకోలేదని కౌంటరిచ్చారు.
అధికారం కోల్పోతామనే భయంతోనే నాపై విమర్శలు
సీఎంగా విఫలమైన వ్యక్తి.. ప్రధాని కావాలని కలలు కనడం తెలుగు వాళ్ల ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందా..?
రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తేనే పెద్ద పీట తెలుగు వాళ్ల ఆత్మగౌరవం నిలుస్తుంది
మీ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు
కొడుకు రాజకీయ భవిష్యత్ కోసమే చంద్రబాబు పనిచేస్తున్నారు
అవినీతి, అక్రమాలను, పాలసీలను బాబు పట్టించుకోవడం లేదు
ఏపీలో ఒక కుటుంబ పాలనతో తెలుగు వాళ్ల ఆత్మగౌరవం ఎలా నిలుస్తుంది?