Narendra Modi: మహిళామణులకు మోదీ తల వంచి నమస్కారం.. ఎందుకంటే?
ఆ బిల్లు ఆమోదం పొందడంతో నారీ శక్తితో దేశ భవిత మరింత వెలుగొందుతుందని చెప్పారు.

Narendra Modi
Narendra Modi – Womens Reservation Bill: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోద ముద్ర పడడంతో ఇవాళ బీజేపీ (BJP) మహిళా ఎంపీలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా మహిళామణులకు మోదీ తలవంచి నమస్కారం చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు.
నారీ శక్తి వందన్ అధినియమ్ (Nari Shakti Vandan Adhiniyam) బిల్లు ఆమోదం పొందడం పట్ల అమితమైన ఆనందం వ్యక్తం చేసిన డైనమిక్ మహిళా ఎంపీలను కలవడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఆ బిల్లు ఆమోదం పొందడంతో నారీ శక్తితో దేశ భవిత మరింత వెలుగొందుతుందని చెప్పారు.
దేశానికి మరింత మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కాగా, మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ, రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. ఈ బిల్లు దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంది. కొత్త పార్లమెంటు భవనంలో ఆమోదం పొందిన తొలి బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లే. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఈ బిల్లును రూపొందించారు.
Had the honor of meeting our dynamic women MPs who are absolutely thrilled at the passage of the Nari Shakti Vandan Adhiniyam.
It is gladdening to see the torchbearers of change come together to celebrate the very legislation they have championed.
With the passage of the Nari… pic.twitter.com/et8bukQ6Nj
— Narendra Modi (@narendramodi) September 21, 2023