‘లాక్‌డౌన్’ పద్మ వ్యూహంలో మోడీ…బైటపడే మార్గమేది? సిఎంల దగ్గర ప్లాన్ ఉందా?

లాక్ డౌన్ ప్రకటించాం. దేశాన్ని దిగ్భంధించాం. మరి కట్టడి నుంచి బైటపడే మార్గమేంటి? ఇది మోడీ సందేహం. అందుకే రాష్ట్రాలు, కేంద్రం కలసి common exit strategyని తయారుచేయాలని అందరు సిఎంలకు కోరారు ప్రధాని. ఒకసారి లాక్ డౌన్ ఎత్తివేశాక, జనం ఒక్కసారిగా రోడ్లమీదకు వస్తారు. మరి ఏం చేయాలి? ఏ వ్యూహంతో కరోను కట్టడిచేయాలో ఆలోచించమని కోరారు.
కరోనాను అడ్డుకోవడానికి గొప్ప అస్త్రంలా లాక్ డౌన్ ను ప్రయోగించారు మోడీ. కనీసం దేశం సర్దుకోవడానికి అవకాశమియలేదు. తన ఇమేజ్‌కు తగ్గట్టుగానే ఆకాశం నుంచి ఊడిపడినట్లుగా, అకస్మాత్తుగా లాక్‌డౌన్ నిర్ణయాన్ని ప్రకటించేశారు. అది వారం నాటి మాట. మరో రెండువారాల్లో లాక్ డౌన్ టైం ముగిసిపోతుంది. దేశం తాళం చెవి తీయాల్సిందే. ఇక్కడే పెద్ద చిక్కు. అప్పటికీ కరోనా తగ్గకపోతే? కేంద్రానికి అంతుచిక్కనిది ఇదే. ఆయన ముందు రెండు అవకాశాలున్నాయి. ఎక్కడెక్కడ కరోనా కేసులున్నాయో గుర్తించి, అంటే క్లస్టర్లు, అక్కడే మాత్రమే కర్ఫ్యూను విధించి, మిగిలిన భారతదేశాన్ని పట్టాలెక్కించడం. రెండో అవకాశం ఒక్కటే. దశలవారీగా లాక్‌డౌన్ ను ఎత్తివేయడం.
ప్రధానితో మీటింగ్‌లో ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రలో ఎలా Cluster containmentవ్యూహంతో కరోనాను ఎదుర్కొంటున్నారో వివరించారు. మోడీ ఉద్దేశం కూడా అదే కావచ్చు. కేంద్రం ఇప్పుడు దక్షిణ కొరియా మార్గాన్నే నమ్ముకొంది. testing, tracing, isolation, quarantine విధానంలో కరోనాను జయించాలన్నది కేంద్ర వ్యూహం. నిజానికి దక్షిణ కొరియా లాక్‌డౌన్ ను ప్రకటించలేదు. వీలైనంతమేర, అందరికీ అనుమాతులను టెస్ట్ చేసింది. నిమషాల్లోనే రిజల్ట్ వస్తుందికాబట్టి, రోజుకు వేలు, లక్షల్లో టెస్ట్ లు చేసింది. మోడీకి ఈ టెక్నిక్ బాగా నచ్చిందన్ని ఢిల్లీ మాట. అందుకే ముఖ్యమంత్రుల సమావేశంలోనూ కోవిడ్ హాట్‌స్పాట్ లను గుర్తించి, దిగ్భందించి, వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా కట్టడిచేయాలని సిఎంలను ఆదేశించారు. Indian Council of Medical Research కూడా rapid antibody testsలను నిర్వహించమని కోరింది. మరణాలు 50ని దాటిపోవడంతో ఐఎంఆర్ మరింత చురుగ్గా పనిచేస్తోంది.
మరోపక్క కర్నాటకలో కొత్తగా కరోనా కేసు నమోదుకాలేదు. సంతోషం. ఇక దేశాన్ని భయపెడుతున్న Nizamuddin చుట్టుప్రక్కల ప్రాంతాల్లో డ్రోన్స్ వాడుతున్నారు. వైరస్ ను చంపేస్తున్నారు.
Also Read | ‘గంగూలీ సపోర్ట్ చేసినట్లుగా కోహ్లీ, ధోనీ చెయ్యలేదు’