చంద్రుడి మీదకు మనుషులు..భారీ రాకెట్ రెడీ చేస్తున్న నాసా

  • Published By: madhu ,Published On : September 5, 2020 / 10:13 AM IST
చంద్రుడి మీదకు మనుషులు..భారీ రాకెట్ రెడీ చేస్తున్న నాసా

Updated On : September 5, 2020 / 10:41 AM IST

2024లో మళ్లీ చంద్రుడి మీదకు మనుషులను పంపేందుకు నాసా ఓ భారీ రాకెట్‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం రాకెట్ బూస్టర్‌ను విజయవంతంగా పరీక్షించింది. 1960లో తయారు చేసిన సాటర్న్ 5 తర్వాత అతిపెద్ద రాకెట్ స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్‌ కోసం ఈ బూస్టర్‌ను పరీక్షించింది.



దీని పొడవు 54 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు. ప్రపంచంలో ఇప్పటివరకూ తయారుచేసిన రాకెట్ బూస్టర్లన్నిటిలోకీ ఇదే అతి పొడవైనది, అత్యంత శక్తివంతమైనది. ఇది సెకనుకు దాదాపు 6టన్నుల ఇంధనాన్ని మండిస్తుంది. నాలుగు ఇంజన్లు గల జంబో జెట్ విమానాలు 14 కలిపి ఉత్పత్తి చేసే పీడనం కన్నా ఎక్కువ పీడనాన్ని పుట్టిస్తుంది.
https://10tv.in/pregnant-wife-exam-1300-km-on-scooty/
బూస్టర్ రాకెట్ మోటార్ పనితీరును, నాణ్యతను పరిశీలించటానికి యూటా రాష్ట్రంలోని ప్రోమాన్టోరీలో ఈ టెస్ట్ నిర్వహించింది. ఇది రెండు నిమిషాల పాటు భారీ అగ్నికీలలు వెదజిమ్మింది.



ఇటీవలే…చంద్రయాన్-2 మిషన్‌లో భాగంగా భారత్ చంద్రుడి పైకి ల్యాండర్‌ విక్రమ్ పంపించిన సంగతి తెలిసిందే. కానీ..ఇది చంద్రుడి ఉపరితలం పైకి చేరుకోకముందే భూమితో సంబంధాలు కోల్పోయింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగే అద్భుత క్షణం కోసం కోట్లాది భారతీయులు ఆతృతగా ఎదురు చూశారు. కూలిపోవడంతో అందరూ నిరాశ చెందారు. తాజాగా నాసా రూపొందిస్తున్న భారీ రాకెట్ పై అందరి దృష్టి నెలకొంది.