Nisha Dahiya: నేను బతికే ఉన్నా, హత్య వార్తలు అవాస్తవమన్న రెజ్లర్ నిషా దహియా

గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తాను మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని హర్యానాకు చెందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్‌, గోల్డ్ మెడలిస్ట్ నిషా దహియా స్పష్టం చేశారు.

Nisha Dahiya : గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తాను మరణించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని హర్యానాకు చెందిన జాతీయ స్థాయి మహిళా రెజ్లర్‌, గోల్డ్ మెడలిస్ట్ నిషా దహియా స్పష్టం చేశారు. తాను బాగానే ఉన్నట్టు ఆమె తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండాకు వచ్చానని, తన హత్యపై వస్తున్న వార్తలన్నీ తప్పని ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ లో నిషా దహియా ఓ వీడియో విడుదల చేశారు. మరో రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ సైతం నిషా హత్యకు సంబంధించిన వార్తలను తోసిపుచ్చారు.

OnePlus Nord 2 : మళ్లీ పేలిన వ‌న్‌ప్ల‌స్ నోర్డ్ 2 ఫోన్.. యూజర్‌కు తీవ్రగాయాలు.. ఫొటోలు వైరల్!

హరియానా సోనిపట్‌లోని హలాల్‌ గ్రామంలో సుశీల్‌ కుమార్‌ రెజ్లింగ్‌ అకాడమీలో నిషా దహియాపై కాల్పులు జరిగినట్లు జాతీయ మీడియాలో తొలుత వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా మరణించారని, ఆమె తల్లి కూడా గాయపడ్డారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై కాసేపటికే రెజ్లర్‌ నిషా క్లారిటీ ఇచ్చారు.

శుక్రవారం సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన రెజ్లింగ్ అండర్‌ 23 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నిషా దహియా 65 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని గెలిచారు. ఇతర మహిళా రెజ్లర్లతో కలిసి అద్భుతంగా ప్రతిభ చూపిన ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

Pickle : నిల్వ పచ్చళ్ళతో ఆరోగ్యానికి ప్రమాదమా..?

నిషా దహియా 2014లో శ్రీనగర్ లో జరిగిన కేడట్ నేషనల్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆ తర్వాతి ఏడాది కూడా పతకం గెలిచారు. 2014లో ఆమె తొలి అంతర్జాతీయ మెడల్ నెగ్గారు. ఆసియా చాంపియన్ షిప్ లో 49 కేజీల విభాగంలో కాంస్యం గెలిచారు. ఆ తర్వాతి సంవత్సరం 60 కేజీల కేటగిరీలో సిల్వర్ నెగ్గారు. 2015 లో నేషనల్ చాంపియన్ షిప్ లో కాంస్యం గెలిచారు.

ట్రెండింగ్ వార్తలు