The Indian Navy: భారత నావికా దళానికి కొత్త శక్తి.. నేవీలోకి చేరిన సబ్ మెరైన్ ‘వాగిర్’

దేశీయంగా తయారైన ‘వాగిర్’ సబ్ మెరైన్ మంగళవారం నావికా దళంలో చేరింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ వెల్లడించింది. ఇది స్కార్పీన్ తరగతికి చెందిన ఐదో సబ్ మెరైన్.

The Indian Navy: భారత నావికా దళానికి కొత్త శక్తి.. నేవీలోకి చేరిన సబ్ మెరైన్ ‘వాగిర్’

Updated On : December 20, 2022 / 8:59 PM IST

The Indian Navy: భారత నావికా దళానికి మరో శక్తి తోడైంది. దేశీయంగా తయారైన ‘వాగిర్’ సబ్ మెరైన్ మంగళవారం నావికా దళంలో చేరింది. ఈ విషయాన్ని ఇండియన్ నేవీ వెల్లడించింది. ఇది స్కార్పీన్ తరగతికి చెందిన ఐదో సబ్ మెరైన్. ప్రాజెక్ట్-75లో భాగంగా స్కార్పీన్ తరగతికి చెందిన ఇలాంటి జలాంతర్గాములు ఆరు తయారు చేయాలని భారత నావికాదళం నిర్ణయించింది.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

దీనిలో భాగంగా తాజాగా ఈ జలాంతర్గామని నావికా దళంలో ప్రవేశపెట్టారు. ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ దీన్ని తయారు చేసింది. ఫ్రాన్స్ దేశానికి చెందిన నావల్ గ్రూప్ సహకారంతో దీన్ని ముంబైలోనే నిర్మించారు. ఈ జలాంతర్గాముల ఉత్పత్తికి సంబంధించి ఇండియా-ఫ్రాన్స్ మధ్య 2005లో ఒప్పందం కుదిరింది. నవంబర్ 12, 2020న వాగిర్ నిర్మాణం ప్రారంభం కాగా, గత ఫిబ్రవరి 1 నుంచి ట్రయల్ రన్ నిర్వహించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆయుధ ప్రయోగాలు, సెన్సర్ ప్రయోగాలు వంటివి కూడా పూర్తయ్యాయి. కేంద్రం చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా ఈ జలాంతర్గామని దేశీయంగానే తయారు చేశారు. ఈ సబ్ మెరైన్ మన నావికా దళాన్ని మరింత బలపేతం చేస్తుంది.

Covid cases: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్‭ కేసులు.. కేంద్రం తాజా ఆదేశాలు

హిందూ మహా సముద్రం ద్వారా చైనా నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా భారత్ తన సైనిక సామర్ధ్యాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే దేశం జలాంతర్గాములను పెంచుకుంటోంది. దీని ద్వారా జల మార్గంలో కూడా చైనాను ఎదుర్కోవడం సులభమవుతుంది.