Nawaz Modi : నా భర్త నుండి అంబానీలే కాపాడారంటూ.. గౌతమ్ సింఘానియా భార్య నవాజ్ మోదీ సంచలన ఆరోపణలు
రేమండ్స్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా భార్య నవాజ్ మోదీ నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నవాజ్ మోదీ భర్త గౌతమ్ సింఘానియాపై సంచలన ఆరోపణలు చేశారు.

Nawaz Modi
Nawaz Modi : రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా, భార్య నవాజ్ మోదీ నుంచి విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. తాజాగా నవాజ్ మోదీ ఈ విషయంపై స్పందించారు. గౌతమ్ సింఘానియా చిత్రహింసలు పెట్టాడని ఆ సమయంలో అంబానీలు వచ్చి సాయం చేసారని చెప్పడం సంచలనంగా మారింది.
Nawaz Modi : భర్తతో విడిపోతున్న నవాజ్ మోడీ ఎవరు? ఆమె గురించి ఆసక్తికరమైన విషయాలు
రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోదీ నుండి విడిపోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించారు. తాము విడిపోయినా కూతుళ్లు నిహారిక, నిసాల కోసం ఏది మంచిదో అదే చేస్తామని కూడా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 32 సంవత్సరాల వివాహ బంధం నుంచి మనస్పర్థల కారణంగా విడిపోతున్నట్లు స్పష్టం చేశారు. దీనిపై తాజాగా నవాజ్ మోదీ స్పందించారు. గౌతమ్ సింఘానియా తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు.
సెప్టెంబర్ 9 న గౌతమ్ సింఘానియా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ సమయంలో గౌతమ్ తనపై, తమ మైనర్ కుమార్తెపై దాడి చేసినట్లు నవాజ్ మోదీ ఆరోపిస్తున్నారు. ఆ సమయంలో తన కూతుళ్లతో పాటు వారి స్నేహితులు కూడా అక్కడ ఉన్నట్లు ఆమె చెప్పారు. తన కూతురిని కాపాడుకోవడం కోసం ఒక గదిలో పెట్టి లాక్ చేసినట్లు ఆమె అన్నారు. తనకు రెండుసార్లు హెర్నియా ఆపరేషన్ జరిగిందని.. అది తెలిసి కూడా తనపై గౌతమ్ దాడి చేసారని నవాజ్ మోదీ చెబుతున్నారు.
Divorce : విడాకులు తీసుకుంటున్న సెలబ్రిటీలు.. ప్రముఖ సింగర్ దంపతుల డివోర్స్
గౌతమ్ దాడి చేసిన సమయంలో నీతా అంబానీ, అనంత్ అంబానీలో తనతో మాట్లాడారని.. వారి కుటుంబం మొత్తం తమకు సాయం చేయడం కోసం ముందుకు వచ్చిందని నవాజ్ మోదీ చెప్పారు. పోలీసుల్ని ఇంటికి రాకుండా గౌతమ్ సింఘానియా ఆపితే అంబానీలు పోలీసులు వచ్చేలా చేశారని ఆమె చెప్పుకొచ్చారు. గౌతమ్ సింఘానియా మాత్రం ఈ ఘటనపై ఎటువంటి ప్రస్తావన తీసుకురాలేదు. గౌతమ్ సింఘానియాతో నవాజ్ మోదీకి 1999 లో వివాహమైంది. సింఘానియాకు రూ.11 వేల కోట్ల ఆస్తి ఉంది. విడాకుల సెటిల్ మెంట్ కోసం నవాజ్ ఆయన ఆస్తిలో 75 శాతం వాటా భరణంగా అడుగుతున్నారు.