NEET 2021 : సెప్టెంబర్ 12 న నీట్ ఎగ్జామ్

దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న కోవిడ్ భద్రతా నిబంధనల మధ్య ఎగ్జామ్ నీట్‌ (UG)2021 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు.

NEET 2021 : సెప్టెంబర్ 12 న నీట్ ఎగ్జామ్

Neet

NEET 2021 దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 12న కోవిడ్ భద్రతా నిబంధనల మధ్య నీట్‌ (UG)2021 ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం ప్రకటించారు. మంగళవారం(జూన్-12,2021) సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

భౌతిక దూరం నిబంధనల మేరకు ఈ పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా గతేడాది 3862ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచనున్నట్లు చెప్పారు. ఎగ్జామ్ సెంటర్ ల వద్ద విద్యార్థులందరికీ మాస్క్ లు ఇస్తామని,శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎంబీబీఎస్, ఎండీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ నీట్ పరీక్ష ఆగస్టు 1 జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదాపడిన విషయం తెలిసిందే. నీట్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా మెడికల్ కాలేజీల్లో అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.