24గంటలూ NEFT బ్యాంక్ సేవలు

24గంటలూ NEFT బ్యాంక్ సేవలు

Updated On : December 7, 2019 / 10:58 AM IST

డిజిటల్ ట్రాన్సక్షన్‌లను ప్రమోట్ చేసే దిశగా ఆర్బీఐ శుక్రవారం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సఫర్ (NEFT) విధానాన్ని డిసెంబరు 16నుంచి  24గంటలూ అందుబాటులోకి తీసుకురానుంది. NEFT ట్రాన్సాక్షన్‌లను గంటకోసారి సెటిల్ చేస్తారు. పనిదినాలలో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకూ పనిచేస్తారు. 

వారాంతాల్లో అయితే ఉధయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకూ సేవలందిస్తారు. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ 24X7సేవలు అందిస్తామని ప్రకటించింది. ఎన్ఈఎఫ్‌టీ ట్రాన్సాక్షన్‌ల తొలి సెటిల్‌మెంట్‌ను డిసెంబరు 16వ తేదీ  అర్ధరాత్రి 00:30గంటలకు పూర్తి చేస్తారు. 

ఏదైనా ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అయిపోతే 2గంటల్లోగా అకౌంట్‌కు యాడ్ అయిపోతాయి. ఆర్బీఐ బ్యాంకులు అన్ని ఎన్ఈఎఫ్‌టీ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది ఆర్బీఐ. బ్యాంకులు ఈ సమాచారాన్ని కస్టమర్లకు తెలియజేయాలని వెల్లడించింది. 

దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్‌లను ప్రోత్సహించేందుకు జూలై 1వ తేదీనే బ్యాంకులన్నీ ఎన్ఈఎఫ్‌టీ, ఆర్టీజీఎస్‌లపై ఛార్జీలు ఎత్తేసింది. గతంలో ఉండే ఛార్జీలను ఎత్తేయడంతో పాటు మినిమం ట్రాన్సాక్షన్ వాల్యూని కూడా పెంచింది ఆర్బీఐ. ఇందులో భాగంగానే ఎన్ఈఎఫ్టీ నిధుల లావాదేవీలను రూ.2లక్షల వరకూ పెంచింది.