Corona Update: దేశంలో అదుపులోకి మహమ్మారి, కొత్తగా ఎన్ని కేసులంటే?

భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

Corona India: భారత్ లో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తుంది. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈమేరకు ఆదివారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 893 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. దింతో ఇప్పటివరకు భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 14.50% శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 16.40% శాతంగా ఉంది.

Also read: Terrorist Encounter: జైషే మహమ్మద్ కమాండర్ సహా ఐదుగురు ముష్కరులు హతం

శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్య 3,52,784 మంది మహమ్మారి నుంచి కోలుకోగా మొత్తం ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,87,13,494 కు చేరింది. దేశంలో రికవరీ రేటు 94.21% శాతానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 16,15,993 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు మొత్తం 72.73 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేపట్టారు. ఇక దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ పంపిణీ కొనసాగుతుంది. ఇప్పటివరకు 165.70 కోట్ల వాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇంకా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 12.43 కోట్ల వాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Also read: Road Accident: కరీంనగర్ లో ఘోర ప్రమాదం, నలుగురు మృతి

దేశంలో వేగంగా వాక్సిన్ పంపిణీ చేయడంతోనే ప్రస్తుతం ప్రమాదకర స్థాయి నుంచి బయటపడుతున్నట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. జనవరి రెండు, మూడు వారాల్లో నమోదైన కేసుల సంఖ్య కంటే ప్రస్తుతం నమోదవుతున్న రోజువారీ కేసుల్లో క్షీణత కనిపిస్తుంది. మరోవైపు.. దేశంలో కరోనా తగ్గుముఖం పడుతుండడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. వారాంతంపు ఆంక్షలు సహా.. నైట్ కర్ఫ్యూని కూడా ఎత్తివేస్తున్నారు. ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. కరోనా ముప్పు ఇంకా కొనసాగుతున్నందున ప్రజలంతా స్వీయ రక్షణ పాటించాలని.. మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటించాలని కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది.

Also read: Child Crime” “మొక్కే కదా అని పీకేస్తే”! బాలుడిని కొట్టి చంపిన మైనర్ బాలుడు

ట్రెండింగ్ వార్తలు