Terrorist Encounter: జైషే మహమ్మద్ కమాండర్ సహా ఐదుగురు ముష్కరులు హతం

భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపారు. ఈఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ, మరో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు మృతి చెందారు.

Terrorist Encounter: జైషే మహమ్మద్ కమాండర్ సహా ఐదుగురు ముష్కరులు హతం

Encounter

Updated On : January 30, 2022 / 9:07 AM IST

Terrorist Encounter: శనివారం సాయంత్రం నుంచి జమ్మూకాశ్మీర్ లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ సహా ఐదుగురు ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఆదివారం ఉదయం జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పుల్వామాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారం మేరకు..భారత భద్రతా దళాలు శనివారం సాయంత్రం నైరా ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఈక్రమంలో పాకిస్తాన్ కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపారు. ఈఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ, మరో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు మృతి చెందారు.

Also read: Road Accident: కరీంనగర్ లో ఘోర ప్రమాదం, నలుగురు మృతి

అదే సమయంలో మధ్య కాశ్మీర్లోని బుద్గామ్ జిల్లాలో జరిగిన మరో ఎన్కౌంటర్ లో పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది హతమైనట్లు కాశ్మీర్ ఐజీపీ వెల్లడించారు. మొత్తం 12 గంటల వ్యవధిలో ఐదుగురు పాక్ ఉగ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుపెట్టినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన భారత భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు చెందిన AK56 తుపాకులు సహా మరికొన్ని పేలుడు పదార్థాలను స్వాదీనం చేసుకున్నారు.

Also read: Child Crime” “మొక్కే కదా అని పీకేస్తే”! బాలుడిని కొట్టి చంపిన మైనర్ బాలుడు