Child Crime” “మొక్కే కదా అని పీకేస్తే”! బాలుడిని కొట్టి చంపిన మైనర్ బాలుడు

"మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్త" అంటూ తెలుగు సినిమా డైలాగ్ ను తలపించేలా.. ఓ మైనర్ బాలుడు ఏడేళ్ల బాలుడిని కొట్టి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Child Crime” “మొక్కే కదా అని పీకేస్తే”! బాలుడిని కొట్టి చంపిన మైనర్ బాలుడు

Crime

Updated On : January 30, 2022 / 7:38 AM IST

Child Crime: “మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్త” అంటూ తెలుగు సినిమా డైలాగ్ ను తలపించేలా.. ఓ మైనర్ బాలుడు ఏడేళ్ల బాలుడిని కొట్టి చంపిన ఘటన మధ్యప్రదేశ్ లోని బుర్హాన్‌పూర్ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. ఖాక్నార్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. బుర్హాన్‌పూర్ జిల్లాలోని షెఖ్‌పూర్ గ్రామంలో జనవరి 26న ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తమ సెనగ తోటకు కాపలాగా వెళ్ళాడు. అదే సమయంలో 7 ఏళ్ల బాలుడు తోటలోని సెనగ మొక్కలను పీకి.. కాయలు కోసుకున్నాడు. ఇది గమనించిన మైనర్ బాలుడు ఆగ్రహంతో మొక్కలు పీకిన బాలుడిని చితకబాదాడు. దింతో బాలుడు స్పృహతప్పి పడిపోగా.. మైనర్ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

Also read: Cold Weather: తెలంగాణలో అసాధారణ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు

అయితే మర్నాడు పొలానికి వచ్చిన మైనర్ బాలుడు.. అక్కడే పడిఉన్న బాలుడిని గమనించి.. కుటుంబ సబ్యులకు గ్రామస్తులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బాధిత బాలుడి కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై జనవరి 28న సమాచారం అందుకున్న ఖాక్నార్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. బాలుడు గొంతు నులిమి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఈ ఘటనపై మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపడుతున్నారు.

Also read: Sai Pallavi : సాయి పల్లవిపై ట్రోల్స్.. తీవ్రంగా ఖండించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై