కరోనాతో కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు మృతి

కరోనా కారణంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది నాయకులను కోల్పోగా.. కర్ణాటకలో బిజెపిని బలోపేతం చేసిన వ్యక్తులలో ఒకరైన రాజ్యసభలో కొత్తగా ఎన్నికైన బిజెపి సభ్యుడు అశోక్ గాస్టి కరోనా కారణంగా మరణించారు. కోవిడ్ -19 పాజిటివ్ ఉన్నట్లు తేలిన తర్వాత అతన్ని సెప్టెంబర్ 2 న ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ లోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే గురువారం రాత్రి 10.31 గంటలకు గాస్టి మరణించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. 55 ఏళ్ల గాస్టి ఈ ఏడాది జూలై 22 న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కర్ణాటక బిజెపి యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడుతో సహా పలువురు బిజెపి నాయకులు ఆయన మరణానికి సంతాపం తెలిపారు. కుటుంబానికి ప్రగాఢ సానభూతి తెలియజేశారు. కరోనా కారణంగా గాస్టికి తీవ్రమైన న్యుమోనియా వచ్చిందని హాస్పిటల్ డైరెక్టర్ మనీష్ రాయ్ తన ప్రకటనలో తెలిపారు.
అశోక్ గాస్టి మరణానికి ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ‘రాజ్యసభ సభ్యుడు అశోక్ గాస్టి అంకితభావం కలిగిన కార్యకర్త అని ప్రధాని ట్వీట్ చేశారు. కర్ణాటకలో పార్టీని బలోపేతం చేయడానికి గాస్టి చాలా కష్టపడ్డారని అన్నారు. సమాజంలోని పేద, అణగారిన వర్గాల సాధికారత కోసం పని చేశారని అన్నారు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి. అని ట్వీట్ చేశారు.
https://10tv.in/100-years-old-women-beats-corona-at-mahendra-mohan-choudhury-hospital/
కరోనా కారణంగా అశోక్ గాస్టి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, అతని చాలా అవయవాలు పనిచేయడం మానేసినట్లు మనీష్ రాయ్ చెప్పారు.