NGT fined Rs 100 crore to KMC : కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100కోట్ల జరిమానా విధించిన NGT .. నెలరోజుల్లో చెల్లించాలని ఆదేశం

కేరళలోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ( NGT) భారీ జరిమానా విధించింది. డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదాలను నిరోధించడంలో విఫలమైందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇటీవల బ్రహ్మపురం వ్యర్ధాల శుద్ధి కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదం మున్సిపల్ నిర్లక్ష్యంతోనే జరిగిందని పేర్కొంటు ఈ జరిమానా విధించింది.

NGT fined Rs 100 crore to KMC : కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100కోట్ల జరిమానా విధించిన NGT .. నెలరోజుల్లో చెల్లించాలని ఆదేశం

NGT fined Rs 100 crore to KMC

NGT fined Rs 100 crore to Kochi Municipal Corporation : కేరళ (Kerala) లోని కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ ( Kochi Municipal Corporation)కు నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ ( NGT) భారీ జరిమానా విధించింది. డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదాలను నిరోధించడంలో విఫలమైందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఇటీవల బ్రహ్మపురం వ్యర్ధాల శుద్ధి కర్మాగారం (Brahmapuram garbage)లో జరిగిన అగ్నిప్రమాదం (fire incident)మున్సిపల్ నిర్లక్ష్యంతోనే జరిగిందని పేర్కొంటు ఈ జరిమానా విధించింది.

కాగా బ్రహ్మపురం వ్యర్ధాల శుద్ధి కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదం మార్చి 2న ప్రారంభమై మార్చి 13 వరకు కొనసాగింది. ఈ ప్రమాదం వల్ల కేరళలోని కొచ్చిలో వాతావరణ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని ప్రజలు వీధుల్లోకి రావడానికి భయపడగా..అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు రావాలంటేనే హడలిపోయేవారు. ఒక వేళ బయటకు వచ్చినా.. ముఖాలకు ముసుగులు ధరించడం, శరీరం నిండా బట్టలు వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ పలు ఇబ్బందులకు గురి అయ్యారు. దీనికి కారణం బ్రహ్మపురం వ్యర్ధాల శుద్ధి కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదమే. దీంతో కొచ్చిలో డంపింగ్‌ యార్డ్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (NGT) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఈ నిర్లక్ష్యానికి కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.100కోట్ల భారీ జరిమానా విధించింది.

కొచ్చి నగర శివారులోని బ్రహ్మపురం ప్రాంతంలో డప్పింగ్ యార్డు వద్ద మార్చి 2 (2023)న అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటలు అతి వేగంగా వ్యాపించటంతో వాటిని అదుపు చేయటానికి ఏకంగా నేవీ రంగంలోకి దిగింది. 30 అగ్నిమాపక యంత్రాలు, 14 భారీ వాటర్‌ పంపులతో సహాయక చర్యలు చేపట్టారు. అలా మూడు రోజులు తీవ్రంగా శ్రమించి మార్చి 5నాటికి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. నాలుగు హెలికాప్టర్లతో 350 మంది సిబ్బంది, 150 మంది సహాయక సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొని మంటల్ని ఆర్పివేశారు.

ఇది భారీ ప్రమాదం కావటం పైగా అది డంపింగ్ యార్డ్ కావటంతో పొగ కొచ్చి నగరమంతా దట్టంగా కమ్మేసింది. విషపూరిత వాయువుల వ్యాప్తితో నగరం గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోయి నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో కేరళ ప్రభుత్వం కల్పించుకుంది. కొచ్చిలో ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజల్ని వీధుల్లోకి రావద్దని అత్యవసరమైతే బయటకు రావాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించింది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారికోసం ఆక్సిజన్ ను అందుబాటులోకి తెచ్చి మెడికల్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసింది.

కాగా ఆ డంపింగ్‌ యార్డ్‌ నిర్వహణ బాధ్యతలను బ్రహ్మపురం వేస్ట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ నిర్వహిస్తోంది. ఈ ప్రమాదం జరగటంతో ఆ ప్లాంట్‌ను మూసివేశారు. ఈ ప్రమాదం కొచ్చిలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లుగా మీడియా కథనాలు రావడంతో దీన్ని ఎన్‌జీటీ సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చెత్తకుప్పల వద్ద అగ్నిప్రమాదాలను నిరోధించడంలో కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు విఫలమైనందుకు రూ.100కోట్లు జరిమానా విధిస్తున్నట్లు ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జరిమానాని నెల రోజుల్లోగా కేరళ చీఫ్‌ సెక్రటరీకి జమ చేయాలని ఎన్‌జీటీ (NGT) ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ (Justice Adarsh ​​Kumar Goyal)ఆదేశించారు.