నిర్భయ దోషుల చివరి కోరిక?

  • Published By: vamsi ,Published On : January 23, 2020 / 05:32 AM IST
నిర్భయ దోషుల చివరి కోరిక?

Updated On : January 23, 2020 / 5:32 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. క్యురేటివ్ పిటిషన్ కూడా కొట్టేశారు. ఇంకేముంది ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉదయం 6గంటలకు నిర్భయ కేసులో దోషులైన నలుగురు మృగాళ్లను చనిపోయేవరకు ఉరి తీయనున్నారు.

ఈ సంధర్భంగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే .నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌లను ప్రత్యేకంగా జైలు గదుల్లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. కట్టుదిట్టమైన జైలు వార్డర్ల భద్రత మధ్య దోషులను నిర్భిందించి ఉంచారు అధికారులు. వాళ్లు జైలులో ఇంతకాలం చేసిన పనికి గానూ వారు సంపాధించిన డబ్బును వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు.

ఈ క్రమంలోనే ఉరిశిక్ష అమలు దగ్గరపడుతుండగా చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా? అని అధికారులు దోషులను అడగారు. వారి నుంచి ఎలాంటి సమాధానం రానట్లుగా జైలు వర్గాలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం.. మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలని అడగొచ్చు. వారి ఆస్తులను తమకిష్టమైన వారికిచ్చేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విషయాలపై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా వారి నుంచి మౌనమే సమాధానంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

అయితే నిర్భయ దోషలు చివరి కోరిక ఎందుకు అడగట్లేదు. అనేదానిపై అధికారులు చెబుతున్న విషయం ప్రకారం.. వారికి ఉరిశిక్ష ఇంకా ఆలస్యం అవుతుందనే ఆశతో వాళ్లు ఉన్నట్లుగా తెలుస్తుంది.