Fuel Price : సామాన్యులకు అలర్ట్.. పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర కీలక ప్రకటన..
Fuel Price : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా.. దీనిపై కేంద్రం ఏమంటుందంటే...
nirmala sitharaman on fuel price hike assures no petrol diesel rate increases
- పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై
- నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
- ఇంధన ధరల పెంపు ఉండదు
Fuel Price : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే మన దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. మరీ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు వెంటనే దొరక్క జనాలు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం ఉన్న వారు బ్లాక్లో రూ.3 వేల వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో.. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మాట్లాడుతూ.. పెట్రోలు, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలు పెరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
నిర్మలా సీతారామన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా ఒక సమావేశం నిర్వహించారని, అందులో పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ల కొరత ఉండకూడదని సూచించారు. ప్రపంచ పరిస్థితి కారణంగా వాటి ధరలను పెంచకూడదని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.
ఇప్పటికే తమ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. అలాగే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిందని, తద్వారా వారు ఈ ముడి సరుకును దిగుమతి చేసుకోగలరని, సామాన్య ప్రజలు ఎలాంటి ధరల పెరుగుదలను ఎదుర్కోవలసిన అవసరం ఉండదని ఆమె అన్నారు. బయటి నుండి ముడి సరుకును తెచ్చుకుని, భారతదేశంలో శుద్ధి చేసి ఎగుమతి చేసే రిఫైనరీలు ఇకపై అధిక సుంకాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని ప్రధానమంత్రి మరో నిర్ణయం తీసుకున్నారని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో మరోసారి లాక్ డౌన్ అంటూ వస్తోన్న వార్తలు నిరాధారమైనవన్నారు. గతంలో కోవిడ్ సమయంలో అమలు చేసినటువంటి లాక్ డౌన్ లాంటిది ఉండదని ఆమె హామీ ఇచ్చారు.
