NISAR Mission 2025 : రాబోయే రోజుల్లో ఇక ప్రకృతి విపత్తుల నుంచి తప్పించుకోవడం సాధ్య పడుతుందా? భూకంపాలకు వణికిపోవాల్సిన అవసరమే ఉండదా? అవును.. ఆ ఒక్క శాటిలైట్ నింగిలోకి దూసుకుపోతే చాలు.. భూ ప్రపంచంలో ఎక్కడే మార్పు జరిగినా వెంటనే తెలిసిపోతుంది.
దాదాపు పదేళ్ల నుంచి అమెరికన్ స్పేస్ సెంటర్ నాసాతో కలిసి ఇండియన్ ఏజెన్సీ ఇస్రో డెవలప్ చేస్తున్న నిసర్ దాదాపు పూర్తి కావొచ్చింది. వచ్చే మార్చిలో ఈ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపనున్నట్లు నాసా ప్రకటించింది. ఒక్కసారి నిసర్ కనుక ఆకాశంలోకి దూసుకుపోయి తన తన కక్షలో చేరితే చాలు ఇక భూమిపై ఏ ప్రదేశమైనా నిస్సర్ పరిధిలోకి వచ్చేస్తుంది.
భూమి పై ఉన్న ప్రతి ప్రదేశాన్ని మైక్రో లెవెల్ లో స్కాన్ చేయగల సామర్థ్యం నిసర్ కు ఉందంటున్నారు. ఈ శాటిలైట్ ద్వారా ప్రతి 12 రోజుల్లో రెండుసార్లు ఇలా సమాచారం అందుతుంది.
భూమిపై ఉన్న నేల కానీ సముద్రాలు, అలానే గడ్డ కట్టిన ప్రాంతాలు.. ఉపరితలం ఏదైనా సరే వాటిలో సంభవించే మార్పులను నిసర్ పసిగడుతుంది. నిసర్ శాటిలైట్ మన షార్ సెంటర్ నుంచే ప్రయోగించబోతున్నారు. 2014 లో అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ ఉపగ్రహం తయారవుతుంది. అద్వితీయమైన కచ్చితత్వంతో గ్రహాల మార్పులను పరిశీలించగల నైపుణ్యంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.5800 కోట్లు. డ్యూయల్ ఫ్రీకెన్సీ రాడార్ తో తయారు చేస్తున్నారు.
Also Read : మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదా..? చంద్రబాబు ర్యాంకింగ్స్ దేనికి సంకేతం..