Gossip Garage : మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదా..? చంద్రబాబు ర్యాంకింగ్స్ దేనికి సంకేతం..

క్యాబినెట్‌లో కొత్త వారికి చాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించటం చంద్రబాబుతోనే ప్రారంభమైంది.

Gossip Garage : మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదా..? చంద్రబాబు ర్యాంకింగ్స్ దేనికి సంకేతం..

Updated On : December 24, 2024 / 9:36 PM IST

Gossip Garage : ఏపీలో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. జనసేన నుంచి నాగబాబుకి క్యాబినెట్ బెర్త్ కన్ఫామ్ అయింది. మరోవైపు మంత్రుల పనితీరుకు ర్యాకింగ్స్ ఇస్తానని అంటున్నారు సీఎం చంద్రబాబు. ఐతే ర్యాంకింగ్ తక్కువ వస్తే వేటు పడుతుందా? మంత్రివర్గంలో మార్పులుంటాయా..? చంద్రబాబు మాటల వెనుక ఆంతర్యమేంటి? క్యాబినెట్ విస్తరణపై కూటమి టాక్‌ ఏంటి?

జనవరిలో మంచి రోజు చూసుకొని నాగబాబు ప్రమాణస్వీకారం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఆరుమాసాలు దాటింది. క్యాబినెట్‌లో ఒక్కస్థానమే ఖాళీగా ఉంది. అది జనసేన కోటాలో నాగబాబుకి కన్ఫామ్ చేశారు. ఇక ప్రమాణ స్వీకారం చేయడం ఆలస్యం. జనవరిలో మంచి రోజు చూసుకొని నాగబాబు ప్రమాణస్వీకారం చేస్తారని జనసేన పార్టీ ఆఫీస్‌ నుంచి టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

Also Read : మేము అధికారపక్షం కాదు ప్రతిపక్షం కాదు, ఆ రెండు కూటములకు దూరం- విజయసాయిరెడ్డి

నిజానికి రెండేళ్ల వరకు క్యాబినెట్ విస్తరణ జోలికి చంద్రబాబు వెళ్లే అవకాశం లేదు. కానీ ఎప్పుడైతే నాగబాబు వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి టీడీపీలోని ఆశావహులు సైతం నెమ్మదిగా అధినేతకు అప్పీల్స్‌ చేస్తున్నారంట.. ప్రతి క్యాబినెట్ సమావేశంలో మంత్రులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు సీఎం చంద్రబాబు.. అదే సమయంలో పనితీరు మెరుగుపర్చుకోని నేతలకు చురకలు కూడా వేస్తున్నారు.

Cabinet Expansion

నలుగురు, ఐదుగురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి..!
ఆరు నెలల పాలనపై మంత్రులకు ర్యాంకింగ్స్ ఇస్తానని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుదనే గాసిప్‌ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా వెంటనే క్యాబినెట్ విస్తరణ చేశారని అదే పరిస్థితి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుందనేది సీనియర్ల సైడ్‌ నుంచి వినిపిస్తున్న టాక్‌.. నలుగురు, ఐదుగురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ కూడా బిగ్ సౌండ్ చేస్తోంది. ఇక వారి ప్లేస్‌లో తమకు మంత్రి పదవి ఖాయమని కొందరు సీనియర్లు ఆశగా వెయిట్ చేస్తున్నారట.

చంద్రబాబు ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. తాను కష్టపడి పనిచేయడమే కాకుండా తన టీం కూడా అదే స్థాయిలో పనిచేయాలని కోరుకునే నైజం చంద్రబాబుది. ఎప్పుడు సమర్ధతకి పెద్దపీట వేసే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రుల విషయంలో కూడా అదే విధంగా ముందుకు పోయే అవకాశముంది. కానీ వారికి తగిన సమయం ఇవ్వకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రెండేళ్ల తర్వాతే క్యాబినెట్ విస్తరణ ఉంటుందనే మరో చర్చ కూడా నడుస్తోంది.

క్యాబినెట్‌లో కొత్తవారికి చాన్స్ ఇవ్వడం, కీలక శాఖలు వారికి అప్పగించటం చంద్రబాబుతోనే ప్రారంభమైంది. దానివల్ల సానుకూల ఫలితాలు కూడా వచ్చాయని అంటున్నారు కొందరు పార్టీ నేతలు. పార్టీలో చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి అయ్యే అన్ని అర్హతలున్నా అనేక సమీకరణాలు మంత్రి పదవిని దూరం చేశాయి. సీనియర్లు మంత్రివర్గంలో బెర్త్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు కానీ ప్రస్తుతానికైతే చంద్రబాబు విస్తరణ చేసే అవకాశమే లేదని కొందరు నేతలు బలంగా నమ్ముతున్నారు.

రెండేళ్ల వరకు విస్తరణపై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదనే హింట్..!
కేవలం నాగబాబుని మాత్రమే క్యాబినెట్‌లో తీసుకుంటారని చెబుతున్నారు. ఆ స్థానం కూడా జనసేనదే కావడంతో టీడీపీ సీనియర్ల నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు రెండేళ్ల వరకు విస్తరణపై ఆశలు పెట్టుకోకపోవడమే మంచిదనే హింట్ కూడా వినిపిస్తోందంట.. మరి చంద్రబాబు ఇచ్చే ర్యాకింగ్స్.. ఆ తరువాత వాట్‌ నెక్ట్స్‌.. కూటమిలో వినిపిస్తున్న ఈ చర్చకు ఎండ్‌ కార్డ్‌ ఏంటో చూడాలి..

 

Also Read : 410 మందిని విధుల నుంచి తొలగిస్తున్నాం: ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్‌ జీవీ రెడ్డి