యూరిన్ తో యూరియా తయారు చేయ్యొచ్చట : గడ్కరీ వ్యాఖ్యలు  

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 10:32 AM IST
యూరిన్ తో యూరియా తయారు చేయ్యొచ్చట : గడ్కరీ వ్యాఖ్యలు  

Updated On : March 4, 2019 / 10:32 AM IST

నాగపూర్ : యూరిన్‌తో యూరియా తయారు చేయొచ్చునని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో బీజేపీ అగ్రనేతలు సైతం చేస్తున్న వ్యాఖ్యలు వివాదాలకు కూడా దారి తీస్తున్న క్రమంలో నాగపూర్ నగరంలో జరిగిన మేయర్ ఇన్నోవేషన్ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
మూత్రం నుంచి యూరియా తయారు చేయవచ్చని, ఇలా చేస్తే విదేశాల నుంచి యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. సహజ వ్యర్థాల నుంచి బయో ఇంధనం తయారు చేయవచ్చని..మానవ మూత్రంతో అమ్మోనియం సల్ఫేట్, నత్రజని తయారు చేయవచ్చని మంత్రి వర్యులు సెలవిచ్చారు. విమానాశ్రయాల్లో మూత్రాన్ని నిల్వ చేస్తే యూరియాను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని, మూత్రం కూడా ఎంతో శక్తి కలదని..ఏదీ వృథా కాదని మంత్రి పేర్కొన్నారు. తనకు వచ్చే ఆలోచనలు అద్భుతమని, కాని ఇతరులు, మున్సిపల్ అధికారులు సహకరించరని మంత్రి చెప్పారు.
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్
 
కొన్నేళ్లుగా తాను తన సొంత మూత్రాన్ని నిల్వ చేసి దాన్ని ఎరువుగా ఢిల్లీలోని తన అధికారిక బంగళాలో తోట పెంచుతున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. మానవ జుట్టు వ్యర్థాల నుంచి సేకరించిన ఎమినో ఆమ్లం ఎరువుగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఎమినో ఆమ్లం వల్ల తన వ్యవసాయక్షేత్రంలో 25 శాతం పంట ఉత్పత్తి పెరిగిందని మంత్రి పేర్కొన్నారు.

నాగపూర్ లో తగినంత జుట్టు లేక నెలకు పది ట్రక్కుల కేశాలను తిరుపతి నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. దుబాయ్ దేశం నుంచి 180 కంటెయినర్ల ఎమినో ఆమ్లాన్ని కొనేందుకు తాము ఆర్డరు చేశామని మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.
Also Read : పాక్ కు బుద్ధి చెప్పాల్సిందే : ఐరాస వద్ద నిరసల హోరు
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం