Cheetah Project : కునో నేషనల్ పార్కులో రేడియో కాలర్స్ వల్ల చీతాలు మృతి చెందలేదు…ప్రాజెక్ట్ చీఫ్ ఎస్పీ యాదవ్ వెల్లడి

కునో నేషనల్ పార్కులో చీతాల మృతిపై చీతాల ప్రాజెక్టు అధిపతి ఎస్పీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేడియో కాలర్ వల్ల ఏర్పడిన ఇన్ఫక్షన్ వల్ల చీతాలు మరణించినట్లు వచ్చిన వార్తలను ఎస్సీ యాదవ్ ఖండించారు. రేడియో కాలర్స్ వల్ల ఒక్క చీతా కూడా మరణించలేదని యాదవ్ స్పష్టం చేశారు....

Cheetah Project : కునో నేషనల్ పార్కులో రేడియో కాలర్స్ వల్ల చీతాలు మృతి చెందలేదు…ప్రాజెక్ట్ చీఫ్ ఎస్పీ యాదవ్ వెల్లడి

Cheetah Project

Updated On : September 15, 2023 / 11:18 AM IST

Cheetah Project : కునో నేషనల్ పార్కులో చీతాల మృతిపై చీతాల ప్రాజెక్టు అధిపతి ఎస్పీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేడియో కాలర్ వల్ల ఏర్పడిన ఇన్ఫక్షన్ వల్ల చీతాలు మరణించినట్లు వచ్చిన వార్తలను ఎస్సీ యాదవ్ ఖండించారు. రేడియో కాలర్స్ వల్ల ఒక్క చీతా కూడా మరణించలేదని యాదవ్ స్పష్టం చేశారు. (Kuno National Park) ప్రపంచవ్యాప్తంగా అన్ని వన్యప్రాణులకు రేడియో కాలర్ ఏర్పాటు చేయడం సర్వసాధారణమని ఆయన చెప్పారు. వన్యప్రాణుల సంచారాన్ని రేడియో కాలర్ల ద్వారానే పర్యవేక్షిస్తామని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ కార్యదర్శి అయిన యాదవ్ (Project Cheetah chief SP Yadav) పేర్కొన్నారు.

Nipah : కేరళలో నిపా వైరస్ కలకలం..హైరిస్క్ వ్యక్తులకు పరీక్షలు

నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి 20 చీతాలను కునో నేషనల్ పార్కుకు తీసుకురాగా, వీటిలో 14 చీతాలు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. మరో నాలుగు చీతా పిల్లలు భారత గడ్డపై జన్మించాయని, అవి బాగున్నాయని చెప్పారు. వాతావరణ పరిస్థితుల వల్ల మూడు చీతా కూనలు మరణించాయని చెప్పారు.

Domestic LPG Cylinder : ఎన్నికల వేళ మహిళలకు తాయిలాలు…రూ.450లకే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్

కునో నేషనల్ పార్కులో 9 చీతాలు మరణించాయని, వేటగాళ్ల వల్ల చీతాలు మరణించలేదని తెలిపారు. 75 ఏళ్ల క్రితం అంతరించి పోయిన చీతాలను మళ్లీ తీసుకువచ్చి వీటి సంతానాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఒప్పందం ప్రకారం దక్షిణాఫ్రికా ఏడాదికి 12 నుంచి 14 చీతాలను పంపించేందుకు సిద్ధంగా ఉందన్నారు.