No Flight Services : 5 గంటల పాటు విమానాల రాకపోకల నిలిపివేత.. ఎందుకంటే ?

తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 23వతేదీన 5 గంటల పాటు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయ సంప్రదాయం ఆరట్టు ఊరేగింపు రన్‌వే గుండా వెళ్లేందుకు వీలుగా....

No Flight Services : 5 గంటల పాటు విమానాల రాకపోకల నిలిపివేత.. ఎందుకంటే ?

Thiruvananthapuram Airport

Updated On : October 18, 2023 / 11:26 AM IST

Thiruvananthapuram Airport : తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 23వతేదీన 5 గంటల పాటు విమానాల రాకపోకలు నిలిచిపోనున్నాయి. తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని శ్రీపద్మనాభస్వామి ఆలయ సంప్రదాయం ఆరట్టు ఊరేగింపు రన్‌వే గుండా వెళ్లేందుకు వీలుగా అక్టోబర్ 23వతేదీన ఐదు గంటల పాటు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయం అధికారులు తెలిపారు.

Also Read : ఢిల్లీ-మీరట్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం.. అక్టోబర్ 20న ప్రారంభించనున్న మోదీ

ఈ ఆచారం ట్రావెన్‌కోర్ రాయల్స్‌తో కూడిన దశాబ్దాల నాటి ఆచారానికి అనుగుణంగా ఉంది. శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి అల్పాసి ఆరట్టు ఊరేగింపును సులభతరం చేయడానికి అక్టోబర్ 23వతేదీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. శతాబ్దాల తరబడిగా పుణ్యక్షేత్రం ద్వి-వార్షిక ఉత్సవ ఊరేగింపు రన్‌వే గుండా వెళ్లేందుకు వీలుగా దశాబ్దాలుగా విమానాశ్రయం కార్యకలాపాలను నిలిపివేస్తోంది.

Also Read : జమ్మూ సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పులు…ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు గాయాలు

విగ్రహాల పవిత్ర స్నానం కోసం షంగుముఖం బీచ్‌కు చేరుకోవడానికి ఈ రన్ వే మార్గం గుండా ఆలయ ఊరేగింపు ఆచారం శతాబ్దాల క్రితం ప్రారంభమైంది. 1932వ సంవత్సరంలో విమానాశ్రయం స్థాపించిన తర్వాత కూడా ఇది కొనసాగుతోంది. విమానాశ్రయ నిర్వహణను అదానీ గ్రూప్ తీసుకున్న తర్వాత కూడా ఈ రాచరికపు ఆచారం కొనసాగుతోంది.