CBI New Rules: నో జీన్స్, నో టీ-షర్ట్స్.. క్లీన్ షేవ్‌తో ఫార్మల్స్ వేసుకుంటేనే ఆఫీసుకి

Cbi New Rules
CBI New Rules: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఆఫీసర్లకు కొత్త రూల్స్ పెట్టారు. క్యాజువల్ డ్రెస్సులలో ఆఫీసుకు వస్తే అనుమతి లేదని తేల్చి చెప్పారు. డిప్యూటీ డైరక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఆఫీసర్స్ నుంచి వచ్చిన ఆర్డర్లలో మగ ఉద్యోగులు కచ్చితంగా ట్రౌజర్లు, షర్ట్స్, ఫార్మల్ షూస్, సరైన షేవింగ్ తోనే రావాలి.
మహిళా ఉద్యోగులు సూట్స్, శారీలు, ఫార్మల్ షర్టులు, ట్రౌజర్లలో రావచ్చు. ‘స్పోర్ట్స్ షూస్, జీన్సులు, టీ షర్టులు, చప్పల్స్, క్యాజువల్ డ్రెస్సులు వంటివి వేసుకొస్తే ఆఫీసులోకి అనుమతి లేదు’ అని ఆర్డర్ వచ్చింది. కొందరు స్టాఫ్ సరైన డ్రెస్ కోడ్ పాటించడం లేదని తెలిసిందని అధికారులు అంటున్నారు.
కొత్త చీఫ్ గా అపాయింట్ అయిన జైస్వాల్.. ఏజెన్సీకి చెందిన 33వ డైరక్టర్ గా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
జైస్వాల్ 1985 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్. ఈ అపాయింట్మెంట్ రాకముందు ఆయన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో డైరక్టర్ జనరల్ గా సేవలు అందిస్తున్నారు.