లాక్ డౌన్ పరిష్కారం కాదు…ప్రజలదే బాధ్యత అంటున్న యడియూరప్ప

Corona Virus ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ పరిష్కారం కాదని..ప్రజలదే బాధ్యత అంటున్నారు ముఖ్యమంత్రి యడియూరప్ప. కంటెయిన్ మెంట్ జోన్లు మినహా, మిగతా బెంగళూరు నగరంలో 2020, జులై 22వ తేదీ బుధవారం లాక్ డౌన్ తో ముగియనున్న సంగతి తెలిసిందే. దీనిపై సీఎం యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.
లాక్ డౌన్ సమయంలో, ఇతర సమయాల్లో ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు పని చేసిందని కొనియాడారు. వైరస్ కట్టడి చేయాలంటే..మాత్రం ప్రజల చేతుల్లోనే ఉందని మరోసారి స్పష్టం చేశారు. లాక్ డౌన్ ను నగరంలో మరో 15 రోజులు పొడిగిస్తారనే ప్రచారం జరిగింది.
గత మూడు, నాలుగు రోజులగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో యడియూరప్ప ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బెంగళూరు, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కాదు..కంటెన్ మెంట్ జోన్లలో నిబంధనలు అమల్లో ఉంటాయన్నారు. ప్రతొక్కరూ సహకరించాలని కోరారు.
బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా..జులై 14 నుంచి నగరంలో లాక్ డౌన్ అమలు చేశారు.
ఈ లాక్ డౌన్ జులై 22వ తేదీ వరకు కొనసాగనుంది. కానీ కేసులు తగ్గుతాయని అనుకుంటే..అలా జరగలేదు. పాజిటివ్ కేసులు పెరిగాయి. ఇప్పటి వరకు బెంగళూరు నగరంలో 33 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి.