No Toll Fee : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

వాహనదారులకు ఇది శుభవార్తే. టోల్‌బూత్‌ల దగ్గర వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి టోల్ బూత్ దగ్గర 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ చెల్లించే సమయంలో వాహనాల బారు ఆ గీతను దాటితే ఇక టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు క్యూలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే వదిలేయాల్సి ఉంటుంది.

No Toll Fee : వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు

No Need To Pay Toll Fee Nhai New Guidelines

Updated On : May 27, 2021 / 3:12 PM IST

No Toll Fee : వాహనదారులకు ఇది శుభవార్తే. టోల్‌ గేట్ల దగ్గర వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. టోల్ గేట్ల దగ్గర క్యూ లైన్లు ఎక్కువ పొడవు లేకుండా ఉండేందుకు కేంద్రం కొత్త రూల్స్ తీసుకు వస్తోంది. ఇందులో భాగంగా ప్రతి టోల్ గేట్ దగ్గర 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాల లైన్ 100 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉంటే.. అప్పుడు లైన్ ముందున్న వెహికల్స్ టోల్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు. ఇలా లైన్ పొడవు 100 మీటర్ల లోపునకు వచ్చే వరకు ముందు వెహికల్స్‌ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు.



ఈ మేరకు జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. వాహనదారుల కష్టాలు తీర్చే ఉద్దేశంతోనే ఎన్‌హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిన్న(మే 26,2021) మార్గదర్శకాలు విడుదల చేసింది. టోల్‌ప్లాజాల దగ్గర నిరీక్షణ సమయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో టోల్ ప్లాజాల దగ్గర ఒక్కో వాహనానికి రుసుము చెల్లించేందుకు పట్టే కాలం పది సెకన్లకు తగ్గిపోనుందని ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.



ఇకపోతే ఫిబ్రవరి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి రూల్స్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర ఆగకుండానే వెళ్లిపోవచ్చు. టోల్ చార్జీలు ఫాస్టాగ్ నుంచి కట్ అవుతాయి.