Sharad Pawar: పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు.. ఇండియా పేరు మార్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శరద్ పవార్

మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో విలేకరుల సమావేశంలో ఎన్‌సీపీ చీఫ్‌ మాట్లాడారు. రాజ్యాంగంలో భారతదేశం పేరు మార్చబడుతుందా? ఈ ప్రశ్నకు పవార్ స్పందిస్తూ.. దీని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు

Sharad Pawar: పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు.. ఇండియా పేరు మార్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శరద్ పవార్

Bharat Name Change: జీ-20 విందులో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని రాయకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాయడంపై చెలరేగిన దుమారం నేపథ్యంలో నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో జరిగే ‘ఇండియా’ కూటమి సమావేశంలలో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఎన్డీయేతో పోటీ చేసేందుకు ఏర్పాటైన ఈ కూటమిలో 28 పార్టీలు చేరాయి.

Pawan Kalyan Video: ఇండియా పేరు మార్పు.. చిరంజీవి, రాజమౌళి ఎదుట నిలబడి పవన్ చేసిన కామెంట్స్ వైరల్

మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో విలేకరుల సమావేశంలో ఎన్‌సీపీ చీఫ్‌ మాట్లాడారు. రాజ్యాంగంలో భారతదేశం పేరు మార్చబడుతుందా? ఈ ప్రశ్నకు పవార్ స్పందిస్తూ.. దీని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. పవార్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే బుధవారం ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల అధినేతల సమావేశానికి పిలిచారు. ఈ సమావేశంలో ఆ అంశంపై చర్చిస్తాం. అయితే దేశం పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు. ఏ దేశానికైనా పేరు చిరస్థాయి. దాన్ని అలాగే కనొసాగించాలి” అని అన్నారు.