చిన్మయానంద్‌ను అరెస్టు చేయలేదు.., నమ్మకముండాలి

ఏదైనా పరిశోధనా సంస్థకు అప్పగించినప్పుడు నమ్మకం ఉండాలి. ఒకవేళ పరిశోధన తప్పుడు దారిలో వెళితే.. హైకోర్టు మమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. మా నుంచి అధికారిక వివరణ అడుగుతారు.

చిన్మయానంద్‌ను అరెస్టు చేయలేదు.., నమ్మకముండాలి

Updated On : September 18, 2019 / 3:52 PM IST

ఏదైనా పరిశోధనా సంస్థకు అప్పగించినప్పుడు నమ్మకం ఉండాలి. ఒకవేళ పరిశోధన తప్పుడు దారిలో వెళితే.. హైకోర్టు మమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. మా నుంచి అధికారిక వివరణ అడుగుతారు.

బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద్‌పై సుప్రీం కోర్టులో నడుస్తోన్న  కేసుపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సంచలన వ్యాఖ్యలు చేసింది. బుధవారం అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడిపై ప్రభావం చూపించాలని మీడియా కానీ, వేరే వ్యక్తులు కానీ కావాలనే చేస్తున్నారు. 

‘ఏదైనా పరిశోధనా సంస్థకు అప్పగించినప్పుడు నమ్మకం ఉండాలి. ఒకవేళ పరిశోధన తప్పుడు దారిలో వెళితే.. హైకోర్టు మమ్మల్ని మానిటర్ చేస్తుంటుంది. మా నుంచి అధికారిక వివరణ అడుగుతారు. మేమెలాంటి ప్రలోభాలకు లోను కావడం లేదు. ఎటువంటి మీడియా ప్రభావం మాపైన లేదు’ అని సిట్ ప్రధాన అధికారి వెల్లడించారు. 

‘చిన్మయానంద్‌కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్‌లో జరిగిన మార్పులు గురించి మాట్లాడను. ఇప్పటి వరకూ అరెస్టు కాలేదు. మేము అందరినీ ప్రశ్నించడానికి మాత్రమే పిలిపించాం. ప్రజలు అంతా ప్రశ్నిస్తున్నారు. మేము ఇన్వెస్టిగేషన్ ఆపేది లేదు. మమ్మల్ని నిరూపించుకోవడానికి సర్టిఫికేట్‌లు చూపించాల్సిన అవసరం లేదు’ అని అధికారి తెలిపారు. 

బాధితురాలు ఈ ఘటనపై స్పందిస్తూ..’రెండ్రోజుల పాటు మెజిస్ట్రేట్ ముందు నేను చెప్పిన స్టేట్‌మెంట్ విని రికార్డు చేసుకున్నప్పటికీ చిన్మయానంద్‌ను అరెస్టు చేయలేదు. ప్రభుత్వం నా చావునే కోరుకుంటే కిరోసిన్ పోసుకుని శరీరాన్ని కాల్చుకుంటా’ అంటూ ఆ స్టూడెంట్ మీడియా ముందు చెప్పింది. ఆ మహిళ తండ్రి కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంపై వివరణ ఇవ్వలేకపోతున్నారు. ఢిల్లీలో రేప్ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని వాపోయాడు.