Booster Vaccine Dose : బూస్టర్ వ్యాక్సిన్ డోస్ పై ఐసీఎంఆర్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

కోవిడ్-19 కట్టడికి బూస్టర్‌ డోస్ వ్యాక్సిన్ వినియోగంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ICMR​) కీలక వ్యాఖ్యలు చేసింది. బూస్టర్‌ డోస్ వ్యాక్సిన్ అవసరమనేందుకు

Booster Vaccine Dose :  బూస్టర్ వ్యాక్సిన్ డోస్ పై ఐసీఎంఆర్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Icmr

Updated On : November 22, 2021 / 7:48 PM IST

Booster Vaccine Dose  కోవిడ్-19 కట్టడికి బూస్టర్‌ డోస్ వ్యాక్సిన్ వినియోగంపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన సంస్థ (ICMR​) కీలక వ్యాఖ్యలు చేసింది. బూస్టర్‌ డోస్ వ్యాక్సిన్ అవసరమనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని సోమవారం ఐసీఎంఆర్​ డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ స్పష్టం చేశారు. దేశంలో అర్హులైన ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ రెండో డోసు ఇవ్వడమే ప్రభుత్వపు తొలి ప్రాధాన్యమని ఆయన తెలిపారు.

కాగా, డిసెంబరు 31నాటికి వయోజనులందరికీ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతవరకు 43 శాతం మంది రెండు డోసులు తీసుకోగా..82 శాతం మంది మొదటి డోసును పూర్తి చేసుకున్నారు.

ఇక,బూస్టర్ డోస్ వ్యాక్సిన్ విషయమై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(NTAGI) ఈ నెలాఖరులోగా ఓ విధానాన్ని ప్రకటించనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దేశంలో బూస్టర్‌ డోసు వినియోగంపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.
ALSO READ Buggana on Telangana: తెలంగాణ ఏర్పాటుతో చాలా నష్టపోయాం!