దేశంలో ఏ రాష్ట్రానికి 3 రాజధానులు లేవు : ఎంపీ గల్లా జయదేవ్ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.

దేశంలో ఏ రాష్ట్రానికి 3 రాజధానులు లేవు : ఎంపీ గల్లా జయదేవ్ 

Updated On : December 13, 2023 / 4:34 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశాన్ని బుధవారం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో లేవనెత్తారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెచ్చిందని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవన్నారు. రాజధాని రాష్ట్ర సమస్య కాదు.. జాతీయ సమస్య అన్నారు.

3 రాజధానుల వల్ల అనేక సమస్యలు వస్తాయన్నారు. 2015లో కేంద్రం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అమరావతి రాజధాని కోసం రైతులు వేల ఎకరాల భూములిచ్చారని తెలిపారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు 29వేల మంది రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు భూములిచ్చిన రైతులకు వైసీపీ ప్రభుత్వం పరిహారం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.

ఈ క్రమంలో గల్లా జయదేవ్‌ ప్రసంగంపై వైసీపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. ఆయన ప్రసంగానికి అడ్డుపడ్డారు. అయినా గల్లా ప్రసంగాన్ని కొనసాగించారు. 3 రాజధానులు తెస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే 3 రాజధానుల ఏర్పాటు కాదన్నారు. మూడు రాజధానులతో అనేక సమస్యలు వస్తాయని గల్లా జయదేవ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఏపీలో మూడు రాజధానుల ప్రకటన అంశానికి సంబంధించి నిన్న పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ లో గల్లా జయదేవ్ కేంద్రానికి వరుస ప్రశ్నలను సంధించారు. ఏపీ రాజధానుల అంశంపై కేంద్రం ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తుందా? అని ప్రశ్నించారు. రాజధానికి భూమిచ్చిన రైతులతో పాటు పెట్టుబడులకు సంబంధించి పలు అంశాలపై ప్రభావం చూపుతుందని, దీనిపై కేంద్రం ఎలాంటి సూచనలు చేస్తుందో చెప్పాలని ఎంపీ గల్లా జయదేవ్ సూటిగా ప్రశ్నించారు. దీనిపై కేంద్రం స్పష్టమైన సమాధానమిచ్చింది.

ఏపీలో మూడు రాజధానుల అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఏపీ రాష్ట్రాన్ని వేడిక్కిస్తున్న ఈ అంశంపై తొలిసారి అధికారికంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది. పార్లమెంటులో బడ్జెట్ సెషన్ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు బదులుగా లిఖిత పూర్వక సమాధానాన్ని ఇచ్చింది. గత జీవో ప్రకారం ఏపీ రాజధానిగా అమరావతి ఉందని కేంద్రం అభిప్రాయపడింది. మూడు రాజధానుల అంశంపై లోక్ సభలో కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్ సమాధానమిచ్చారు.