మాకు కావలసింది చప్పట్లు కాదు.. ప్రొటెక్షన్: డాక్టర్ల విజ్ఞప్తి

మాకు కావలసింది చప్పట్లు కాదు.. ప్రొటెక్షన్: డాక్టర్ల విజ్ఞప్తి

Updated On : March 22, 2020 / 5:03 AM IST

ప్రధాని నరేంద్ర మోడీ.. జనతా కర్ఫ్యూకు దేశ ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం జరిగే ఈ కర్ఫ్యూలో సాయంత్రం 5గంటలకు మెడికల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, పోలీసులకు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేయాలని సూచించారు. కరోనాతో ప్రాణ భయం అని తెలిసినా..  మెడికల్ సిబ్బంది వారి దగ్గరకు వెళ్లి చికిత్స అందిస్తున్నారని వారికి థ్యాంక్స్ చెప్పాలని కోరారు. 

దీని పట్ల ప్రధాని మోడీకి వైద్య సిబ్బంది సోషల్ మీడియా వేదికగా మరో విజ్ఞప్తి చేస్తున్నారు. మెడికల్ ప్రొఫెషనల్స్‌కు కావలసింది చప్పట్లు కాదని.. తమకు కరోనా పేషెంట్ల దగ్గరకు వెళ్లి చికిత్స చేసేందుకు పర్సనల్ ప్రొటెక్షన్ కావాలి. అంటూ డాక్టర్లు ట్విట్టర్ వేదికగా ప్రధానికి విజ్ఞప్తిని అందజేస్తున్నారు. 

‘నేనొక ప్రభుత్వ సర్జన్‌ను. కొవిడ్-19 నాకు కూడా వచ్చేలా ఉంది. ఇంకా టెస్టు చేసుకోలేదు. ఇంకా తెలీదు. మా కాజువాలిటీలో పేషెంట్‌ను చూసేందుకు 2నుంచి 20మంది విజిటర్లను అనుమతిస్తున్నారు. రోజుకు 600మంది పేషెంట్లు వస్తున్నారు. వారందరి వ్యక్తిగత వివరాలు అడిగి.. ట్రావెల్ హిస్టరీ తెలుసుకుని పంపుతున్నాం’

‘మాకున్న సదుపాయాలకు మేం ఇంతకుమించి చేయలేకపోతున్నాం. మాకు మీ చప్పట్లు వద్దు. మా క్షేమం కోసం మీరు మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి. పర్సనల్ భద్రత పరికరాలు కావాలి. ప్రభుత్వం మంచి ప్లానింగ్‌లతో రావాలి. మీ పనులపై మాకు నమ్మకం కలిగేలా చేయండి. ఇంకా బెటర్ అవ్వాలి’ అని ఒక డాక్టర్ తన ఆవేదనను ట్వీట్ ద్వారా వ్యక్తపరిచారు. 

చత్తీస్ ఘడ్ నుంచి యోగేశ్ జైన్ అనే ఓ డాక్టర్ ట్వీట్ చేస్తూ.. ‘పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కొరతతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి మనకింకా కాస్త సమయం దొరికింది. లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ నుంచి వస్తేనే ఈ జాగ్రత్తలు తీసుకుంటారా’ అని ప్రశ్నించారు.