Adani- BJP : అదానీ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి భయంలేదు..దాచి పెట్టేది అంతకంటే లేదు : అమిత్ షా
అదానీ వ్యవహారంలో బీజేపీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. అదానీ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి భయంలేదని.. దాచి పెట్టాల్సింది అంతకంటే లేదు అంటూ స్పష్టంచేశారు. అదానీ గ్రూప్ వివాదం గురించి సుప్రీంకోర్టు పరిధిలో ఉందని కాబట్టి దీనిపై తాను ఇప్పుడు మాట్లాడటం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు అమిత్ షా.

Nothing for BJP to hide and be afraid of..over Hindenburg-Adani row : Amit Shah
Adani- BJP : అదానీ వ్యవహారంలో బీజేపీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. అదానీ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి భయంలేదని దాచి పెట్టాల్సింది అంతకంటే లేదు అని స్పష్టంచేశారు. అదానీ గ్రూప్ వివాదం గురించి సుప్రీంకోర్టు పరిధిలో ఉందని కాబట్టి దీనిపై తాను ఇప్పుడు మాట్లాడటం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు అమిత్ షా. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ విషయంపై స్పందించటం సరికాదన్నారు. అదానీ వ్యవహారంలో బీజేపీపై విపక్షాలు అభాండాలు వేస్తున్నాయని..ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు.
కాగా..అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ కంపెనీల గురించి నివేదిక ఇచ్చిన తరువాత అదానీ కంపెనీల షేర్లు ఒక్కసారిగా అమాతంగా కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. దాదాపు రూ.10లక్షల కోట్ల మేరకు మార్కెట్ విలువను కోల్పోయాయి. దీంతో అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన బ్యాంకులు, ఎల్ ఐసీ వంటి సంస్థలు తీవ్రంగా నష్టపోవటం దేశాన్ని కుదిపేసింది. అదానీ వ్యవహారంపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు దద్దరిల్లిపోయాయి. విమర్శలు ప్రతి విమర్శలతో హోరెత్తిపోయాయి. హిండెన్ బర్గ్ నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం..బీజేకీ అదానీకి ఉన్న సంబంధాల గురించి చర్చించాలని కాంగ్రెస్ తో పాటు విపక్షాలు డిమాండ్ చేశాయి. విపక్షాలు చేసే డిమాండ్స్ పై బీజేపీ చర్చను పక్కదోవ పట్టిస్తూ..విపక్షాల డిమాండ్స్ ను మాత్రం ఏమాత్రం పట్టించుకోవటంలేదు.
పైగా విపక్షాలు చేసే విమర్శలను తిప్పికొడుతుందే తప్ప కమిటీ వేయటానికి మాత్రం అంగీకరించలేదు. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. సుప్రంకోర్టు ప్రధాని న్యాయమూర్తి చంద్రచూడ్ సారథ్యంలోను బెంచ్ దీనిపై విచారణ జరుపుతోంది. అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టినవారికి ఎటువంటి రక్షణ కల్పిస్తారో కోర్టుకు తెలియజేయాలని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇప్పుడున్న నిబంధనలు ఎటువంటివో కూడా వివరించాలని కోరింది.ఇక కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఇకపై ఇటువంటి పరిణామాలు తలెత్తకుండా చూస్తాం అని దానికి ప్రత్యేక నిపుణుల కమిటీ నియమిస్తామని వివరించారు.
ప్రధాని మోడీ అదానీకి దేశాన్ని దోచిపెడుతున్నారని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఈ విమర్శలపై బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోమ్ శాఖా మంత్రి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ..అదానీ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి సంబంధంలేదని దాచి పెట్టాల్సింది అంతకంటే లేదు అంటూ స్పష్టంచేశారు.