మమత పార్టీ కొత్త లోగో : TMC నుంచి ‘కాంగ్రెస్’ తొలగింపు 

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ లోగో మారింది.

  • Published By: sreehari ,Published On : March 23, 2019 / 08:26 AM IST
మమత పార్టీ కొత్త లోగో : TMC నుంచి ‘కాంగ్రెస్’ తొలగింపు 

Updated On : March 23, 2019 / 8:26 AM IST

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ లోగో మారింది.

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ లోగో మారింది. టీఎంసీ.. లోగో నుంచి కాంగ్రెస్ పేరును 21ఏళ్ల తర్వాత  అధికారికంగా తొలగించారు. జాతీయ రాజకీయ పార్టీగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ లేదా టీఎంసీ)ని మమతా 1998, జనవరి 1న స్థాపించారు. ఇప్పటివరకూ తృణమూల్ కాంగ్రెస్ లోగోపై బ్యాక్ గ్రౌండ్ లో కాంగ్రెస్ డిజైన్, రెండు పువ్వులు ఉండేవి. తృణమూల్ పార్టీ కొత్త లోగోలో.. రెండు ట్విన్ ఫ్లవర్లు.. బ్లూ బ్యాక్ గ్రౌండ్ ఉంది. తృణమూల్ అని ఇంగ్లీష్ అక్షరాలను గ్రీన్ కలర్ లో డిజైన్ చేశారు. వారం రోజులుగా ఇదే గుర్తును వినియోగిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also : పేమెంట్ పెంచ‌గానే రెచ్చిపోతే ఎలా : ప‌వ‌న్ పై విజ‌య‌సాయి సెటైర్లు

కొన్నేళ్లు జాతీయ కాంగ్రెస్ లో కొనసాగిన మమతా.. రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి.. 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ‘21 ఏళ్ల తర్వాత టీఎంసీ.. తృణమూల్ గా పిలువబోతున్నాం. మార్పుకు ఇదే సరైన సమయం’ అని పార్టీ నేత ఒకరు తెలిపారు. తృణమూల్ పార్టీ బ్యానర్లు, పోస్టర్ల నుంచి కాంగ్రెస్ పేరును తొలగించారు. ఎన్నికల కమిషన్ లో నమోదు చేసుకోవడమే మిగిలి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు తృణమూల్ పార్టీకి సంబంధించిన అధికారిక ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో కూడా పార్టీ పాత లోగోను మార్చి కొత్త లోగోను అప్ డేట్ చేశారు.