పాలతో అభిషేకించండి.. మజ్జిగ పుచ్చుకోండి!

దేవాలయాల్లో అభిషేకానికి వాడిన పాలను వృథా కాకుండా ఉండేందుకు బెంగళూరులోని గంగాధరేశ్వ దేవాలయ నిర్వాహకులు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

  • Published By: sreehari ,Published On : January 4, 2019 / 07:29 AM IST
పాలతో అభిషేకించండి.. మజ్జిగ పుచ్చుకోండి!

దేవాలయాల్లో అభిషేకానికి వాడిన పాలను వృథా కాకుండా ఉండేందుకు బెంగళూరులోని గంగాధరేశ్వ దేవాలయ నిర్వాహకులు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

దేవాలయంలో భగవంతుడికి భక్తులు అభిషేకం చేయిస్తుంటారు. ఉదయాన్నే ఆలయంలో జరిగే అభిషేకానికి పాలు, పండ్లు, పంచామృతాలతో సర్వేశ్వరుడికి పూజలు జరిపిస్తుంటారు. ఇలా ప్రతి ఆలయంలో జరిగే అభిషేకానికి వినియోగించిన పాలలో కొంత ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. అభిషేకానికి వాడిన పాలను వృథా కాకుండా ఉండేందుకు బెంగళూరులోని గంగాధరేశ్వ దేవాలయ నిర్వాహకులు సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అభిషేకానికి వినియోగించిన పాలను తిరిగి సేకరించి మజ్జిగ చేసి భక్తులకే ప్రసాదంగా ఇస్తున్నారు. సోమవారం నాడు దేవాలయానికి వచ్చిన భక్తులు అభిషేకానికి సమర్పించిన పాలను నిల్వ చేసి ఉంచుతారు.

ఇదే అనవాయితీ..
ఆ పాలను మజ్జిగలా చేసి మరుసటి రోజున గుడికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం అనవాయితీగా మారింది. ప్రతి సోమవారం స్వామివారికి భక్తులు సమర్పించే దాదాపు 500 లీటర్లు వరకు అభిషేకించిన పాలను సేకరిస్తుంటామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. అయితే భక్తులు అభిషేకం చేసే సమయంలో పసుపు, కుంకుమ మిక్స్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆ తరువాత పాలను సేకరిస్తుంటామని ఆలయ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. అనంతరం ఆ పాలను నిల్వ చేసి మజ్జిగ తయారుచేస్తామని అన్నారు. అభిషేకం చేసిన పాలను మంగళవారం రోజున మజ్జిగ రూపంలో తిరిగి భక్తులకే పంచి పెడుతున్నట్టు చెప్పారు. దీంతో ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య గతంలో కంటే ఎక్కువ పెరిగిందని చెప్పారు.

నో ప్లాస్టిక్.. లేదంటే మజ్జిగ కట్.. 
అభిషేకం చేసిన భక్తులకే కాదు.. గుడికి వచ్చే ఎవరైనా సరే ఈ మజ్జిగను స్వీకరించవచ్చు. గుడిలోనే ప్రసాదంగా మజ్జిగను స్వీకరించవచ్చు. లేదంటే ఇంటికి కూడా తీసుకెళ్లవచ్చు. మరో విషయం ఏమిటంటే.. ఇక్కడి దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులు నిషిద్ధం. ప్లాస్టిక్ వస్తువులతో వచ్చిన భక్తులకు మజ్జిగను ఇవ్వరు. మజ్జిగను ప్రసాదంగా ఇవ్వడం ఆరంభించినప్పటినుంచి దేవాలయకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని ఆలయ అధికారి ఒకరు పేర్కొన్నారు. మజ్జిగను ప్రసాదంగా స్వీకరించన ఓ భక్తుడు మాట్లాడుతూ.. ‘‘ఇదొక గొప్ప నిర్ణయం. మజ్జిగ ప్రసాదం చాలా రుచిగా ఉంది. మా కుటుంబ సభ్యులంతా సేవించారు. ఇక సమ్మర్ అయితే ఆలయానికి వచ్చే భక్తులకు మజ్జిగ సేవించడం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది’’ అని తెలిపాడు.