Gujarat Officer Suspend : గుజరాత్ సీఎం కార్యక్రమంలో నిద్రపోయిన అధికారి సస్పెండ్

సీఎం కార్యక్రమంలో పాల్గొన్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ నిద్రపోయారు. అధికారి జిగర్ పటేల్ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా కెమెరాల కంటపడ్డారు.

Gujarat Officer Suspend : గుజరాత్ సీఎం కార్యక్రమంలో నిద్రపోయిన అధికారి సస్పెండ్

Gujarat Officer Suspend

Updated On : April 30, 2023 / 10:26 PM IST

Gujarat Officer Suspend : గుజరాత్ సీఎం భూపేంద్ర కార్యక్రమంలో నిద్రపోయిన ఓ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్రంలో కచ్ జిల్లాలోని భుజ్ లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు. 2001లో భుజ్ లో సంభవించిన భూకంప బాధితులకు పునరావాసం కింద ఇచ్చిన నివాస గృహాల పత్రాలను 14,000 మందికి పంపిణీ చేశారు.

అనంతరం సీఎం భూపేంద్ర పటేల్ ప్రసంగించారు. అయితే, సీఎం కార్యక్రమంలో పాల్గొన్న భుజ్ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ జిగర్ పటేల్ నిద్రపోయారు. అధికారి జిగర్ పటేల్ ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న మీడియా కెమెరాల కంటపడ్డారు. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు.

Madhya Pradesh: ప్రభుత్వ అధికారిని స్టేజీపైకి పిలిచి, సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి

విధుల్లో నిర్లక్ష్యం వహించడం, దుష్ప్రవర్తన, విధుల్లో బాధ్యతా రాహిత్యం వంటి ఆరోపణలపై ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు గుజరాత్ పట్టణాభివృద్ధి, పట్టణ గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.