Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఇదే.. వీడియో షేర్‌ చేసిన భవిష్‌ అగర్వాల్‌

తాజాగా "ఓలా" తన కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ను నెట్టింట్లో పెట్టింది. ఈ స్కూటర్‌ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందన్న సంకేతాలిస్తూ ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ఓ ట్వీట్‌ చేశారు.

Ola Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఇదే.. వీడియో షేర్‌ చేసిన భవిష్‌ అగర్వాల్‌

Ola Electric Scooter

Updated On : July 2, 2021 / 9:05 PM IST

Ola Electric Scooter : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాల తయారి కంపెనీలు శరవేగంగా ఉత్పత్తి చేస్తున్నాయి. కొత్త కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా “ఓలా” తన కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ వీడియోను నెట్టింట్లో పెట్టింది. ఈ స్కూటర్‌ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందన్న సంకేతాలిస్తూ ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ఓ ట్వీట్‌ చేశారు.

బ్లాక్ కలర్ లో ఉన్న ఈ స్కూటర్ ఫీచర్లను వీడియోలో తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 – 60 కిలోమీటర్ల వేగాన్ని ఈ ట్వీట్ చదివేంత సమయంలోనే అందుకుంటుందని భవిష్ పేర్కొన్నారు. ట్వీట్ ను బట్టి చూస్తే అతి తక్కువ సమయంలో ఇది 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని అర్ధమవుతుంది.

లిథియం అయాన్‌ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. బ్యాటరీ మార్చుకునేందుకు వీలుగా దీనిని డిసైన్ చేశారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తుంది. ఇక దీని ధర విషయం మాత్రం వెల్లడించలేదు