Oldest Learner : వృద్ధ అభ్యాసకురాలు భాగీరథీ అమ్మ కన్నుమూత

వందేళ్ల వయస్సులోనూ నాలుగో తరగతి చదివిన వృద్ధురాలు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఈమె తుదిశ్వాస విడిచారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈమె...పేరు భాగీరథ అమ్మ (107)..శనివారం కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.

Bhageerathi Amma Dies : వందేళ్ల వయస్సులోనూ నాలుగో తరగతి చదివిన వృద్ధురాలు అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఈమె తుదిశ్వాస విడిచారు. కేరళ రాష్ట్రానికి చెందిన ఈమె…పేరు భాగీరథీ అమ్మ (107)..శనివారం కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు. గురువారం రాత్రి కొల్లాం జిల్లా ప్రక్కూలంలోని తన నివాసంలో వయో సంబంధిత వ్యాధుల కారణంగా..తుదిశ్వాస విడిచారని వెల్లడించారు.

Read More : Project-K : ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ – కె’ ప్రారంభం..

ఇక ఈమె విషయానికి వస్తే…వయసుతో సంబంధం లేకుండా చదువుకోవాలని భాగీరథీ అమ్మ భావించారు. దీంతో 105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి చదివారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి..అందరి దృష్టిని ఆకర్షించారు. చదువుపై శ్రద్ధ చూపిన భాగీరథీకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం అభినందనలు తెలియచేశారు. ఈమె కష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019 సంవత్సరానికి ‘నారీశక్తి’ పురస్కారాన్ని అందచేసింది. భాగీరథీ మృతిపట్ల కేరళ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలియచేశారు. మహిళా సాధికారతరకు నిదర్శనమంటూ కొనియాడారు.

ట్రెండింగ్ వార్తలు