మోడీవన్నీ మత రాజకీయాలే..బీజేపీ సీనియర్ లీడర్ రాజీనామా

  • Published By: venkaiahnaidu ,Published On : February 8, 2020 / 06:43 PM IST
మోడీవన్నీ మత రాజకీయాలే..బీజేపీ సీనియర్ లీడర్ రాజీనామా

Updated On : February 8, 2020 / 6:43 PM IST

బీజేపీ నాయకుల్లో కూడా క్రమంగా సీఏఏ వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. వెస్ట్ బెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు సీఏఏ,ఎన్ఆర్సీల విషయంలో ఇటీవల నేరుగానే సొంతపార్టీ వైఖరిపైనే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పలు చోట్ల బీజేపీ నాయకులు కూడా మోడీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏను,ప్రతిపాదిత ఎన్ఆర్సీను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ బీజేపీ నాయకుడు సీఏఏను వ్యతిరేకిస్తూ ఏకంగా పార్టీకి,తన పదవికి రాజీనామా చేశాడు.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన బీజేపీ లీడర్ ఉస్మాన్ పటేల్ తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశాడు. మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ మత రాజకీయాలు మాత్రమే చేస్తుందని ఆయన అన్నారు. ఆర్థికమందగమనం వంటి విషయాలనుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు అన్ని మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారన్నారు. పూర్తి అంకితభావంతో 40ఏళ్లుగా బీజేపీకి పనిచేస్తున్నానని,కానీ ఇప్పుడు బీజేపీ దాని సొంత వసుదైవ కుటుంబం అనే సిద్దాంతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున తాను పార్టీకి.పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. 

వాస్తవ సమస్యలను బీజేపీ పట్టించుకోవట్లేదని ఉస్మాన్ పటేల్ తెలిపారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందని,జీడీపీ తగ్గిపోతుందన్నారు. కానీ ఈ సమయంలో పార్టీ ప్రజల మధ్య గొడవలు పెట్టే చట్టాలను తీసుకొస్తుందని అన్నారు. అయితే పటేల్ మాత్రమే కాదు గత నెలలో సీఏఏను వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ లో 80మంది ముస్లిం బీజేపీ నాయకులు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఎన్ఆర్సీ,సీఏఏ వల్ల కేవలం ముస్లింలకు మాత్రమే ఇబ్బంది కాదని,ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు కూడా ఇబ్బందేనని మధ్యప్రదేశ్ కు చెందిన మరో బీజేపీ నాయకుడు అన్నారు.