Operation Ganga Special Flight Carrying 218 Indian Nationals From Bucharest Lands In New Delhi
Operation Ganga : యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటికే వందలాది మంది భారతీయులను ఎయిరిండియా విమానాల్లో సేఫ్‌గా తీసుకొచ్చింది. ఈ క్రమంలో యుక్రెయిన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది.
యుక్రెయిన్ నుంచి స్వదేశానికి భారత పౌరులు చేరుతున్నారు. ఈ రోజు (మార్చి 2, బుధవారం) ఉదయం బుకారెస్ట్ నుంచి 218 మంది భారతీయులతో ఢిల్లీకి విమానం చేరుకుంది. స్వదేశానికి చేరుకున్న భారత పౌరులకు కేంద్రమంత్రి అశ్విన వైష్ణవ్ స్వాగతం పలికారు. మరోవైపు ఇప్పటికే పోలాండ్ నుంచి 437 మంది భారతీయులతో ఢిల్లీకి ప్రత్యేక విమానాలు బయల్దేరాయి. హంగేరి నుంచి ఢిల్లీకి మరో విమానం చేరుకోనుంది. ఈ విమానంలో 222 మంది భారతీయులు ఉన్నారు.
హంగేరి, రుమేనియా, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్ వంటి దేశాల్లో నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియను కేంద్రమంత్రులైన వికె సింగ్, హార్దీప్ సింగ్ పూరి, జ్యోతి రాదిత్య, కిరెన్ రిజుజు స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 182 మంది భారతీయ విద్యార్థులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి ఏడో విమానం ముంబైకి చేరుకుంది.
కేంద్ర మంత్రి నారాయణ్ రాణే విమానశ్రయంలో భారతీయ విద్యార్థులకు స్వాగతం పలికారు. 216 మంది భారతీయ పౌరులతో కూడిన 8వ విమానం హంగేరీలోని బుడాపెస్ట్ నుంచి న్యూఢిల్లీకి బయల్దేరింది. 218 మంది భారతీయులతో బుకారెస్ట్ నుంచి బయల్దేరిన 9వ విమానం న్యూఢిల్లీకి చేరుకుంది. ఇప్పటి వరకు 7 విమానాల్లో 1,578 మంది భారతీయులను యుక్రెయిన్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.
Operation Ganga : రెండో రోజూ మోదీ అత్యున్నత సమావేశం :
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేసేలా.. ఉక్రెయిన్ సరిహద్దులకు పలువురు కేంద్రమంత్రులు వెళ్లనున్నారు. సోమవారం అర్థరాత్రి మరో విమానం బుకారెస్ట్ నుంచి భారతీయ విద్యార్థులతో బయలుదేరింది. ఆపరేషన్ గంగాలో భాగంగా ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన 218 మంది భారతీయ పౌరులతో 9వ విమానం రోమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి న్యూఢిల్లీకి చేరింది.
ఇప్పటికి ఆరు విమానాలు భారత్‌కు చేరుకోగా.. భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయా సరిహద్దు దేశాలకు మరో 26 విమానాలు వెళ్లనున్నాయి. రొమేనియాకు భారత వాయుసేన విమానం C17 బయల్దేరి వెళ్లింది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం నుంచి భారతీయులంతా బయల్దేరినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది.
Read Also : Russia Ukraine War : ఆపరేషన్ గంగ వేగవంతం.. యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు మరో 26 విమానాలు..