Russia Ukraine War : ఆపరేషన్ గంగ వేగవంతం.. యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు మరో 26 విమానాలు..

Russia Ukraine War : యుక్రెయిన్‌లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. అక్కడ చిక్కుకున్న భారత్ సహా ఇతర విదేశీయులను ఆయా దేశాలు తమ స్వదేశాలకు తిరిగి ప్రత్యేక విమానాల్లో తరలిస్తున్నారు.

Russia Ukraine War : ఆపరేషన్ గంగ వేగవంతం.. యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు మరో 26 విమానాలు..

Russia Ukraine War 26 Flights To Evacuate Indians From Ukraine

Russia Ukraine War : యుక్రెయిన్‌లో రష్యాతో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధ పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న భారత్ సహా ఇతర విదేశీయులను ఆయా దేశాలు తమ స్వదేశాలకు తిరిగి ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్తున్నాయి.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న మన భారతీయులను కూడా కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటికే వందలాది మంది భారతీయులను ఎయిరిండియా విమానాల్లో సేఫ్‌గా
తీసుకొచ్చింది. ఈ క్రమంలో యుక్రెయిన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను కేంద్రం మరింత వేగవంతం చేసింది.

ఆపరేషన్ గంగలో భాగంగా ఇప్పటికి ఆరు విమానాలు భారత్​‌కు చేరుకున్నాయి. మరిన్ని విమానాలు స్వదేశానికి రానున్నాయి. ఆపరేషన్ గంగలో భాగంగానే యుక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్న భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి
తీసుకొచ్చేందుకు ఆయా సరిహద్దు దేశాలకు మరో 26 విమానాలను వెళ్లనున్నాయి. ఈ తెల్లవారుజామున రొమేనియాకు భారత వాయుసేన విమానం C17 బయల్దేరి వెళ్లింది.

Russia Ukraine War : కీవ్ నుంచి బయల్దేరిన భారతీయలు :
ఇప్పటికే యుక్రెయిన్ నుంచి 60 మంది భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తి అయినట్టు కేంద్రం ఒక ప్రకటనలో వెల్లడించింది. యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం నుంచి భారతీయులంతా బయల్దేరినట్టు విదేశాంగ శాఖ పేర్కొంది. భారత పౌరుల తరలింపు కోసం యుక్రెయిన్ సరిహద్దు దేశాలైన రొమేనియాలోని బుకారెస్ట్, హంగేరీలోని బుడాపెస్ట్‌‌, పోలాండ్, స్లోవాక్ రిపబ్లిక్‌ ఎయిర్ పోర్టులను వినియోగించుకోనున్నట్టు హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు.

Russia Ukraine War 26 Flights To Evacuate Indians From Ukraine (1)

Russia Ukraine War : 26 flights to evacuate Indians from Ukraine, says MEA

Russia Ukraine War :  యుక్రెయిన్ నుంచి సరిహద్దు దేశాలకు.. 
భారత ప్రభుత్వ మొదటి అడ్వైజరీ ప్రకారం. యుక్రెయిన్‌లో 20వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని అంచనా. వీరిలో 60 శాతం మంది.. సుమారు 12,000 మంది యుక్రెయిన్‌‌‌ను వీడారు. మిగిలిన 40 శాతం మందిలో గం మంది ఖార్కివ్, సుమీ ప్రాంతంలోని సంఘర్షణ జోన్‌కు చేరుకున్నారు. మిగిలిన సగం మంది యుక్రెయిన్ పశ్చిమ సరిహద్దులకు చేరుకున్నారని విదేశాంగ కార్యదర్శి అన్నారు.

యుక్రెయిన్ నుంచి భారతీయ పౌరుల తరలింపు కోసం బుకారెస్ట్, బుడాపెస్ట్, పోలాండ్, స్లోవేకియాకు 25 మంది అధికారుల బృందం వెళ్లింది. ఖార్కివ్​ సహా ఇతర యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులందరినీ సురక్షితంగా, అత్యవసరంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే తమకు గగనతల మార్గానికి ప్రవేశం ఇవ్వాలంటూ రష్యా, యుక్రెయిన్ దేశాలను భారత్​ డిమాండ్ చేసింది. మరోవైపు యుక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా దాడి తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడి భారతీయులందరూ తక్షణమే ఆ నగరాన్ని విడిచిపెట్టాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని కూడా మూసివేశారు. మన దేశానికి చెందిన వారందరూ కీవ్‌ను విడిచిపెట్టారని హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు.

Read Also : Olena Zelenska : నాకు భయం, కన్నీళ్లు రావు.. నా భార్త జెలెన్ స్కీతో ఇక్కడే ఉన్నాం.. ఎక్కడికి పోలేదు..!