Harish Salve – Lalit Modi : హరీష్ సాల్వే పెళ్లిలో లలిత్ మోడీ సందడి.. ఎవరు ఎవరిని రక్షిస్తున్నారంటూ..?
లండన్‌లో జరిగిన భారత సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పెళ్లికి లలిత్ మోడీ హాజరు కావడం విమర్శలకు దారి తీసింది. భారత చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని ఈ వివాహానికి ఎలా గెస్ట్‌గా పిలిచారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

Harish Salve wedding
Harish Salve wedding : భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే బ్రిటన్‌కు చెందిన ట్రినాను లండన్‌లో పెళ్లాడారు. ఈ వివాహానికి ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ హాజరు కావడం వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
Jamili Elections: వన్ నేషన్, వన్ ఎలక్షన్.. బీజేపీ వ్యూహమేంటి.. విపక్షాల అభ్యంతరాలేంటి?
లండన్‌లో జరిగిన హరీష్ సాల్వే, ట్రినాల వివాహానికి నీతా అంబానీ, ఉక్కు దిగ్గజం లక్ష్మీ మిట్టల్, ఉజ్వల రౌత్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి లలిత్ మోడీ హాజరు కావడం కలకలం రేపింది. పన్ను ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుగుతున్న సమయంలో 2010 లో లలిత్ మోడీ భారత్ నుండి పారిపోయి లండన్‌లో నివసిస్తున్నారు. భారత్‌లో అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరైన సాల్వే వివాహానికి పారిపోయిన వ్యక్తి హాజరుకావడంపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Also Read: 68 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లాడిన ప్రముఖ న్యాయవాది
సాల్వే వివాహానికి లలిత్ మోడీ హాజరు కావడంపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్రంపై మండిపడ్డారు. మోడీ ప్రభుత్వానికి ఇష్టమైన న్యాయవాది పెళ్లి చేసుకున్నారు. భారత చట్టం నుంచి తప్పించుకుని పోయిన వ్యక్తి ఈ వివాహానికి గెస్ట్‌గా వచ్చారు. ఎవరు ఎవరికి సాయం చేస్తున్నారు? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? ‘ అంటూ చతుర్వేది ఘాటుగా ట్వీట్ చేసారు.
మహారాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ప్రితేష్ షా కూడా సాల్వే వివాహానికి లలిత్ మోడీ హాజరు కావడాన్ని విమర్శించారు. ఓకే దేశం ఒకే ఎన్నికలపై మోడీ ప్రభుత్వం ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. పరారీలో ఉన్న లలిత్ మోడీ ఆ కమిటీలో ఉన్న హరీష్ సాల్వేతో ఎంజాయ్ చేస్తున్నారు.. అంటూ ఆరోపించారు. ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కూడా స్పందించింది. ‘ప్రధాని మోడీ ప్రతిష్టకు నల్ల మచ్చ’ అని పేర్కొంది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI)ని రూ.753 కోట్ల మేర మోసం చేసారని 2010 లో లలిత్ మోడీపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన భారత్ నుండి పారిపోయి లండన్‌లో ఉంటున్నారు.
भ्रष्टाचार मुक्त भारत की बात करने वाले Modi के दामन पर एक और काला धब्बा ⚫
Modi के करीबी Harish Salve देश का हज़ारों करोड़ लूटने वाले भगोड़े Lalit Modi के साथ जश्न मना रहे हैं
Harish Salve को ‘One Nation One Election’ की High Level Committee का सदस्य भी बनाया गया है
देश की… pic.twitter.com/seDI9PI9Nk
— AAP (@AamAadmiParty) September 4, 2023