Harish Salve: 68 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లాడిన ప్రముఖ న్యాయవాది

హరీష్ సాల్వే తన భార్య త్రినా నుదిటిపై ముద్దు పెట్టుకున్న ఫొటోతో పాటు పెళ్లి వీడియోలు ట్విటర్ లో షేర్ అయ్యాయి.

Harish Salve: 68 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లాడిన ప్రముఖ న్యాయవాది

Harish Salve third marriage

Updated On : September 4, 2023 / 2:51 PM IST

Harish Salve Marriage: ప్రముఖ న్యాయవాది, భారత మాజీ సొలిసిటర్‌ జనరల్‌ హరీశ్‌ సాల్వే మూడోసారి పరిణయమాడారు. ఆదివారం లండన్‌లో జరిగిన ఓ ప్రైవేట్‌ వేడుకలో త్రినాను (Trina) ఆయన వివాహం చేసుకున్నారు. నీతా అంబానీ (Nita Ambani), ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi), ఉజ్వల రౌత్ (Ujjwala Raut)  సహా పలువురు సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లలిత్ మోదీ తన ప్రియురాలు, మోడల్ ఉజ్వల రౌత్ తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు.

హరీష్ సాల్వే తన భార్య త్రినా నుదిటిపై ముద్దు పెట్టుకున్న ఫొటోతో పాటు పెళ్లి వీడియోలు ట్విటర్ లో షేర్ అయ్యాయి. 68 ఏళ్ల హరీష్ సాల్వే కు ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. 38 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2020, జూన్ లో మొదటి భార్య మీనాక్షికి ఆయన విడాకులు ఇచ్చారు. వీరికి సాక్షి, సానియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2020లోనే కరోలిన్ బ్రోస్సార్డ్ ను రెండో వివాహం చేసుకున్నారు.

Also Read: ర‌ష్మిక కాళ్లు మొక్కిన అసిస్టెంట్‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

సుప్రీంకోర్టు టాప్ లాయర్ అయిన హరీష్ సాల్వే.. భారత సొలిసిటర్‌ జనరల్‌ గా 1999 నుంచి 2002 వరకు పనిచేశారు. ఎన్నో కీలక కేసులను ఆయన వాదించారు. 2018లో కావేరి నదీజలాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాకాల్తా పుచ్చుకున్నారు. టాటా గ్రూపు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలకు ఆయన న్యాయసేవలు అందిస్తున్నారు.

Also Read: తండ్రైన జ‌స్‌ప్రీత్ బుమ్రా.. చిన్నారి పేరేంటో తెలుసా..?

పాకిస్థాన్ మిలటరీ కోర్టులో ఉరిశిక్ష పడిన భారతీయుడు కులభూషణ్ జాదవ్ కేసులో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని వాదించినందుకు ఆయనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. 2015లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ పురస్కారం ప్రకటించింది. అదే ఏడాది బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసును ఆయన వాదించారు. తాజాగా ఆయన మూడో పెళ్లిన సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.