Priyanka Gandhi: ఆ శక్తికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం: ప్రియాంకా గాంధీ
రెండు రోజుల వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక గాంధీ పలు ప్రాంతాల్లో పర్యటించారు.

Priyanka Gandhi
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కేంద్ర సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కేరళలోని తన నియోజక వర్గం వయనాడ్‌లో ఆమె మాట్లాడారు. ప్రజల హక్కులను నిర్వీర్యం చేసే శక్తికి, ఆ హక్కులను కొంత మంది వ్యాపార మిత్రులకు ధారాదత్తం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోందని అన్నారు.
మన దేశ స్ఫూర్తి, భారత ఆత్మ కోసం మనం పోరాడుతున్నామని చెప్పారు. ఏ వ్యవస్థలపై ఆధారపడి మన దేశ నిర్మాణం జరిగిందో, ఆ వ్యవస్థలను నాశనం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్న శక్తిపై పోరాడుతున్నామని వ్యాఖ్యానించారు. వయనాడ్ ప్రజల అవసరాలను తీర్చడానికి వారితో కలిసి పోరాడడానికి వారి వెంటే ఉంటానని ప్రియాంకా గాంధీ అన్నారు.
కాగా, రెండు రోజుల వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పటికే రాహుల్ గాంధీతో కలిసి వయనాడ్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని తిరువంబాడిలోని ముక్కం, నికంబూర్‌లోని కౌలై, వండూరు, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని ఎడవన్న బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇటీవల జరిగిన వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో 4,10,931 ఓట్ల భారీ ఆధిక్యంతో ప్రియాంకా గాంధీ గెలుపొందిన విషయం తెలిసిందే.
Mohan Bhagwat: జనాభా పెరుగుదల రేటుపై ఆర్ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆసక్తికర కామెంట్స్