ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.

  • Published By: venkaiahnaidu ,Published On : February 16, 2019 / 10:50 AM IST
ఉగ్రవాదానికి పర్యాయపదంగా పాక్ : ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తున్నారు

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు. మన భధ్రతా బలగాలపై నమ్మకం ఉందని తెలిపారు. ఉగ్రదాడికి పాల్పడినవారిని శిక్షించేందుకు సెక్యూరిటీ ఫోర్స్ కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలోని పందర్కావడాలో ఇవాళ (ఫిబ్రవరి-16,2019) వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఉగ్రవాదానికి పాకిస్తాన్ పర్యాపదంగా మారిందని అన్నారు.

పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందన్నారు. ఉగ్రవాదానికి పాక్ రెండో పేరుగా మారిందని అన్నారు. పుల్వామాలో జరిగిన దానికి దేశం మొత్తం తీవ్రమైన భాధలో ఉందని, జవాన్ల త్యాగం వృధా కాదని,ఈ దాడికి పాల్పడినవారు తప్పకుండా శిక్ష అనుభవిస్తారని తెలిపారు. ఉగ్రదాడికి పాల్పడినవారిని శిక్షించేందుకు మన భధ్రతా బలగాలు ప్లేస్, టైమ్ డిసైడ్ చేస్తారని అన్నారు. 

అమరుల కుటుంబాల భాధను చూసి అందరూ కన్నీరు పెడుతున్నారని, ప్రజల ఆగ్రహాన్ని మేం అర్థం చేస్తుకున్నామని మోడీ అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల బడ్జెట్  సందర్భంగా ప్రకటించిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ గురించి మాట్లాడుతూ.. మూడు విడతలుగా రైతుల అకౌంట్లలో రూ.6వేలు జమ అవుతాయని తెలిపారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి తాను సిస్సియర్ గా పనిచేశానని అన్నారు.

నాలుగున్నరేళ్ల క్రితం ప్రజలు బలమైన ప్రభుత్వానికి ఓటు వేశారని అన్నారు. మీ ఓటు కారణంగానే స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో ప్రభుత్వం పనిచేయగలిగింది, మీ నుంచి ఏదైనా పొరపాటు జరిగి ఉండి ఉంటే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండిపోయేవాళ్లమని ప్రజలనుద్దేశించి అన్నారు. మీ ప్రధాన్ సేవక్ ని ఆశీర్వదించండి అంటూ ప్రజలను మోడీ కోరారు.

Read Also :  పాక్ పత్రికల్లో పిచ్చి రాతలు : పుల్వామా దాడి స్వాతంత్య్ర పోరాటమంట
Read Also :  ఆల్ పార్టీ – వ‌న్ వాయిస్ : పాక్ పై యుద్ధ‌మేనా