మోడీకి పాములు పంపుతా : పాక్ సింగర్ అక్కసు

  • Published By: madhu ,Published On : September 5, 2019 / 08:44 AM IST
మోడీకి పాములు పంపుతా : పాక్ సింగర్ అక్కసు

Updated On : September 5, 2019 / 8:44 AM IST

భారత్‌పై పాక్ అక్కసు వెళ్లగక్కడం పరిపాటై పోయింది. నేతల నుంచి మొదలుకొని సెలబ్రెటీలు కూడా విమర్శలు చేస్తుంటారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మండిపడుతోంది. పలు ఆంక్షలు విధించింది. ఈ పరిణామాలపై తాజాగా పాకిస్థాన్‌కు చెందిన సింగర్ రబీ ఫిర్జాడా విచిత్రమైన వీడియోను ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు.

ఈ వీడియో విమర్శలకు దారి తీసింది. ప్రధాన మంత్రి మోడీకి విషపూరిత పాములు వదులుతానంటూ చెప్పడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. సెప్టెంబర్ 02వ తేదీన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారామె. వీడియోలు విష సర్పాలతో ఆడుకుంటూ..పాట కూడా పాడింది ఈ సింగర్. ఇండియాతో పాటు మోడీని..వీడియోలో బెదిరించే ప్రయత్నం చేసింది.

జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. కశ్మీర్ నా ఛీనూ..అంటూ పాటలో పేర్కొంది. కశ్మీర్ అమ్మాయిలు పాములను నరేంద్ర మోడీకి గిఫ్ట్‌గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. నరకంలో చావడానికి సిద్ధంగా ఉండండి అంటూ హెచ్చరించింది.

ఇలాంటి విష జంతువులు తన వద్ద ఎన్నో ఉన్నాయని చెప్తూనే..హెచ్చరిస్తోన్న ఈ వీడియోపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.