Pakistani terrorists: భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదుల యత్నం… వీడియో ఇదిగో

భారత్‌లోకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. నిన్న బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్‌లో మడియాన్‌ నానక్‌ పోస్టుకు ప్రాంతం మీదుగా ముగ్గురు ఉగ్రవాదులు చొరబడడానికి యత్నించారు. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్ నిఘా పరికరాల ద్వారా భారత ఆర్మీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేసింది.

Pakistani terrorists: భారత్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదుల యత్నం… వీడియో ఇదిగో

Pakistani terrorists

Updated On : August 26, 2022 / 9:18 AM IST

Pakistani terrorists: భారత్‌లోకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడానికి పాకిస్థాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. నిన్న బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లోని కమల్‌కోట్‌లో మడియాన్‌ నానక్‌ పోస్టుకు ప్రాంతం మీదుగా ముగ్గురు ఉగ్రవాదులు చొరబడడానికి యత్నించారు. ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్ నిఘా పరికరాల ద్వారా భారత ఆర్మీ గుర్తించింది. ఇందుకు సంబంధించిన వీడియోను మీడియాకు విడుదల చేసింది. ఉరీ మీదుగా చొరబడడానికి ముగ్గురు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు దీని ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.

ఆ ముగ్గురు ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన వెంటనే వారిపై భారత ఆర్మీ కాల్పులు జరిపి ఆ ముగ్గరినీ మట్టుబెట్టింది. ఈ వివరాలను భారత ఆర్మీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు యత్నించే అవకాశం ఉందని అంతకుముందే భారత నిఘా వర్గాలు కూడా ఆర్మీకి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల చొరబాట్ల ప్రయత్నాలను భారత భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు భగ్నం చేస్తున్నాయి. ఉగ్రవాదుల కదలికలను గుర్తించడానికి భారత ఆర్మీకి ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు బాగా ఉపయోగపడుతున్నాయి.

ఆర్మీ విడుదల చేసిన వీడియో..