బిపిన్ రావత్ హెచ్చరికలు : మళ్లీ ప్రారంభమైన బాలకోట్ ఉగ్రశిబిరం!

  • Published By: madhu ,Published On : September 23, 2019 / 08:24 AM IST
బిపిన్ రావత్ హెచ్చరికలు : మళ్లీ ప్రారంభమైన బాలకోట్ ఉగ్రశిబిరం!

Updated On : September 23, 2019 / 8:24 AM IST

బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరం తిరిగి ప్రారంభమైందని..కార్యకలాపాలు ప్రారంభించడంతో రుజువు అయ్యిందని..బాలాకోట్ దాడులకు మించి భారత్ స్పందన ఉంటుందని భారత సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. సెప్టెంబర్ 23వ తేదీ సోమవారం చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో బాలాకోట్ ఉగ్ర శిబిరం తుడిచిపెట్టుకపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఉగ్ర కార్యక్రమాలు అధికం కావడంతో మరలా అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకున్నారని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

భారత్‌లో చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు ఎదురు చూస్తున్నాయని, దీనిని భారత్ నిశితంగా పరిశీలిస్తోందన్నారు. కాశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆయన స్పందించారు. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు. లోయలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని, ఆంక్షల్ని క్రమంగా ఎత్తివేస్తామని హామీనిచ్చారు. 
కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు సైనిక వాహనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో 40 మంది ఉగ్రవాదులు వీరమరణం పొందారు. దీనికి ప్రతికారంగా భారత వైమానిక దళం పాక్ భూభాగంలోకి చొచ్చుకొని పోయి..బాలాకోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్ర శిబిరాన్ని నేట మట్టం చేసింది. అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారని సైన్యం వెల్లడించింది.