Canada: కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం

కెనడాలో భారతీయ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..

Canada: కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం

Rift Threatens Students Future

Canada – India: కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భారత్-కెనడా మధ్య సత్సంబంధాలు దెబ్బతింటుండడంతో తమ పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (KTF) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యలో పవన్‌ కుమార్‌ రాయ్‌ జోక్యం ఉందని ఇటీవల కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. పవన్‌ కుమార్‌ రాయ్‌ను కెనడా బహిష్కరించడం, ఆ తర్వాత న్యూ ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయం నుంచి కెనడా గూఢచార సంస్థ విభాగ అధిపతి ఒలివర్‌ సిల్వస్టర్‌ ను ప్రధాని మోదీ సర్కారు బహిష్కరించడంతో ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగింది.

కెనడాలో భారతీయ విద్యార్థులు చాలా మంది ఉన్నారు. బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తమ కూతురు కెనడాలో చదువుకుంటోందని, ప్రస్తుతం నెలకొన్న పరిణామాల వల్ల ఆమె చదువుపై ఎలా దృష్టి పెడుతుందోనన్న ఆందోళన తమలో ఉందని చెప్పారు. తమ కూతురు కెనడాకు వెళ్లి ఏడు నెలల అవుతోందని తెలిపారు.

భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్నాయని వార్తల్లో చెబుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల వల్ల కెనడాలోని తమ కూతురు కూడా ఆందోళన చెందుతోందని చెప్పారు. కుల్దీప్ కౌర్ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ… తన ఇద్దరు కూతుళ్లూ కెనడాలో ఉన్నారని, తాను ఆందోళన చెందుతున్నానని తెలిపారు. ప్రతికూల వాతావరణం తొలగిపోవడానికి ఇరు దేశాల ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు.

Canada : కెనడాలోమరో సంచలన హత్య .. ఖలిస్థాన్ ఉగ్రవాది సఖ్‌దూల్‌ సింగ్‌ హతం